Share News

గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:35 PM

గంజాయి రవాణా, విక్రయాలు సాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీఎ్‌సపీ సాయియశ్వంత్‌ఈశ్వర్‌ అన్నారు. కనిగిరిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని గురువారం డీఎ్‌సపీ నేతృత్వంలో సీఐ ఖాజావలి, ఎస్‌ఐలు మధుసూధన్‌రావు, కోటయ్యలు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. ఈమేరకు స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో డీఎ్‌సపీ వివరాలు వెల్లడించారు.

 గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సాయియశ్వంత్‌ ఈశ్వర్‌, పక్కన సీఐ ఖాజావలి, ఎస్‌ఐ మాధవరావు, కోటయ్య

కనిగిరిలో ఇద్దరు అరెస్ట్‌

340 గ్రాముల స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎ్‌సపీ

కనిగిరి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : గంజాయి రవాణా, విక్రయాలు సాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీఎ్‌సపీ సాయియశ్వంత్‌ఈశ్వర్‌ అన్నారు. కనిగిరిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని గురువారం డీఎ్‌సపీ నేతృత్వంలో సీఐ ఖాజావలి, ఎస్‌ఐలు మధుసూధన్‌రావు, కోటయ్యలు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. ఈమేరకు స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో డీఎ్‌సపీ వివరాలు వెల్లడించారు.

పట్టణంలోని పాతూరుకు చెందిన పాత నేరస్థులైన నాగులూరి అంకబాబు, నాగులూరి వెంకటేశ్వర్లు దొరువు వద్ద ఉన్న దిగువశివాలయం సమీపంలో గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారు. పొదిలి ప్రాంతానికి చెందిన రమేష్‌, సాయి అనే వ్యక్తుల నుంచి 350 గ్రాములు గంజాయి కొనుగోలు చేశారు. వాటిని చిన్న, చిన్న పొట్లాలుగా చేసి చిన్న ప్లాస్టిక్‌ కవర్లలో వేసుకుని పట్టణంలోని మంచినీటి దొరువు వద్ద అమ్ముతున్నారు. ఆకస్మిక దాడి చేసి పరిశీలించగా వారి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ కవర్లలో గంజాయి పొట్లాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. దీంతో వారిరువురినీ అదుపులోకి తీసుకుని విచారించగా పొదిలి ప్రాంతానికి చెందిన గంజాయి రవాణ చేసే రమేష్‌, సాయిల పేర్లను చెప్పారు. వారి కోసం గాలించగా పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న డీఎ్‌సపీ తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టే కార్యక్రమంలో భాగంగా పోలీసు ఆంక్షలు విధించామన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, అధికలోడు కర్రలతో ట్రాక్టర్లలో ర వాణా చేయటం, ట్రాక్టర్‌ సైడ్‌ డోర్‌లు ఒదిలేసి నడపటం, సైడ్‌ డోర్‌లపై కూలీలను ఎక్కించుకుని నడపటంతో పాటు హెల్మట్‌ లేకుండా, మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఖాజావలి, ఎస్‌ఐలు మాధవరావు, కోటయ్య, హెడ్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:35 PM