Share News

చెత్త సేకరణపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:39 AM

స్వచ్ఛభా రత్‌-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణపై శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని డీపీవో గొట్టిపాటి వెంకటనాయుడు పరిశీలించారు.

చెత్త సేకరణపై స్పెషల్‌ డ్రైవ్‌
సంతనూతలపాడులో మహిళకు తడి, పొడి చెత్తను వేరుచేసే విధానాన్ని వివరిస్తున్న డీపీవో వెంకటనాయుడు

పలు గ్రామాల్లో పర్యటించిన డీపీవో వెంకటనాయుడు

తడి, పొడిచెత్త సేకరణపై గృహ యజమానులతో ముఖాముఖి

ఒంగోలు కలెక్టరేట్‌, పిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభా రత్‌-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణపై శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని డీపీవో గొట్టిపాటి వెంకటనాయుడు పరిశీలించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంకోవైపు గృహ యజమానులను కలిసి తడి, పొడిచెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. గృహాల నుంచి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకటనాయుడు సిబ్బందిని ఆదేశించారు. చెత్తను ప్రాసెస్‌ చేసి దాని విక్రయం ద్వారా వచ్చిన సంపద మొత్తాన్ని గ్రామపంచాయతీ ఖాతాకు జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కాగా ఆయా గ్రామాల్లో గృహ యజమానులతో ముఖాముఖి నిర్వహించారు. చెత్తను మీ ఇంటి వద్దకు వచ్చే కార్మికుల వాహనాల్లో వేయాలని సూచించారు. స్వచ్ఛభారత్‌- స్వర్ణాంధ్ర కరపత్రాలను గృహ యజమానులకు పంపిణీ చేశారు.

Updated Date - Feb 23 , 2025 | 01:39 AM