Share News

వెలిగొండకు రూ.2వేల కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:39 AM

వెలిగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు కో రారు.

వెలిగొండకు రూ.2వేల కోట్లు కేటాయించాలి

ఏపీ రైతు సంఘం నాయకుల విజ్ఞప్తి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు కో రారు. విజయవాలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి ఈ మే రకు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా కు వెలిగొండ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదని, జి ల్లాలోని 33 మండలాలతో పాటు నెల్లూరు జిల్లా లో నాలుగు మండలాలు, కడప జిల్లాలో మూడు మండలాలకు సాగునీటితో పాటు తాగునీరు అం దించే ప్రాజెక్టు అని తెలిపారు. అనేక సంవత్సరా ల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగడం లేదని, అందువల్ల ఈ సారి బడ్జెట్‌లో నిధులు కేటాయిం చి పూర్తిలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కో రారు. 11 ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీని విడుదల చేయడంతో పాటు ప్రజలకు పునరావా సం కల్పించాలన్నారు. ఈ ఏడాది నాటికి 18 సం వత్సరాలు నిండిన వారందరికి పునరావాస ప్యా కేజీ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకట్రావు, జె.జయంతిబా బు, డీటీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:39 AM