రైతుల ఇబ్బందులను తొలగించేందుకే రీ సర్వే
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:44 PM
సాగు చేసుకుంటున్న భూములకు కచ్చితమైన కొలత లను నిర్ధారించి రైతుల ఇబ్బందులను తొలగిం చేందుకే అన్నిగ్రామాల్లో ప్రభుత్వం రీ సర్వే కా ర్యక్రమాన్ని ప్రారంభించిందని ఆర్డీవో లక్ష్మీప్రస న్న పేర్కొన్నారు.

ఆర్డీవో లక్ష్మీప్రసన్న
కొత్తపట్నం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సాగు చేసుకుంటున్న భూములకు కచ్చితమైన కొలత లను నిర్ధారించి రైతుల ఇబ్బందులను తొలగిం చేందుకే అన్నిగ్రామాల్లో ప్రభుత్వం రీ సర్వే కా ర్యక్రమాన్ని ప్రారంభించిందని ఆర్డీవో లక్ష్మీప్రస న్న పేర్కొన్నారు. గురువారం కొత్తపట్నం మం డలం ఆలూరు గ్రామంలో జరిగిన రీసర్వే గ్రా మసభలో ఆమె హాజరై ప్రసంగించారు. రీసర్వే ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తార న్నారు. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు. రీసర్వే జరిగే తేదీని రెవెన్యూ అధికారులు ముందుగానే ఆయా గ్రా మాల్లో దండోరా ద్వారా తెలియజేస్తారని, రైతుల సమక్షంలోనే జరుగుతుందని ఆమె చెప్పారు. రీసర్వే ద్వారా భూ వివాదాలు కూడా పరిష్కా రం అవుతాయన్నారు. రైతులు తమ ఇబ్బందుల ను అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవా లని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదనరావు, సర్వే ఇన్‌స్పెక్టర్ గౌస్‌బాష, ఆర్‌ఐ వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.