నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:15 PM
బాలికల హాస్టల్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, సకాలంలో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పామూరులోని పాత ఆస్పత్రి ప్రాంగణంలో రూ.కోటి 94 లక్షల నిధులతో బాలికల వసతి గృహం నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు.

- త్వరితగతిన బాలికల హాస్టల్‌ను పూర్తిచేయాలి
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పామూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బాలికల హాస్టల్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, సకాలంలో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పామూరులోని పాత ఆస్పత్రి ప్రాంగణంలో రూ.కోటి 94 లక్షల నిధులతో బాలికల వసతి గృహం నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఈఈ మన్నయ్యతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్ విద్యను అభ్యసించే బాలికల కోసం ఏర్పాటుచేసే వసతి గృహాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో దీనిని పూర్తి చేయాలని సూచించారు. అలాగే, స్థానిక ఎస్సీ బాలుర హాస్టల్‌లో రూ.8 లక్షలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమాల్లో యారవ శ్రీను, బొల్లా నరసింహారావు, మద్దిశెట్టి రవి, సయ్యద్ అమీర్‌బాబు, ఆర్‌ఆర్ రఫి, వై.ప్రసాద్‌రెడ్డి, షేక్ ఖాజారహంతుల్లా, డీవీ మనోహార్, ఉప్పలపాటి హరిబాబు, ఇర్రి కోటిరెడ్డి, పందిటి హరీష్, పువ్వాడి రామారావు, డోలా శేషు, షేక్ హాజీగౌస్, మెంటా నరసింహారావు, పిడుగు శ్రీను, బండ్ల నారాయణ, వాయినేని రాఘవ, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ రమణయ్య, జనసేన జిల్లా కార్యదర్శి వై.రహీముల్లా, పంచాయతి కార్యదర్శి జీవీ అరవింద, సమగ్రశిక్ష ఏఈ జి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
కాగా, కనిగిరిలోని డయాలసిస్ కేంద్రం ఆధునికీకరణ కోసం పామూరు పట్టణానికి చెందిన టీడీపీ మైనార్టీ సంఘం నాయకులు షేక్ షంషూర్ రూ.25 వేల నగదును ఎమ్మెల్యే ఉగ్రకు అందజేశారు.
డీఎల్‌డీవోపై ఫిర్యాదు
పామూరు చెత్త సంపద కేంద్రంలో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎల్‌డీవో కె.శ్రీనివాసరెడ్డి హేళనగా మాట్లాడారని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు ఫిర్యాదుచేశారు. చెత్త సంపద కేంద్రంలో కాంట్రాక్ట్ శానిటరి మేస్ర్తీగా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగుడైన షేక్ ఈమాంసాను విధుల్లోకి రావద్దంటూ హేళనగా మాట్లాడారని పంచాయతీ కార్యదర్శి, జీవీ అరవింద, ఈమాంసాలు తెలిపారు. బాలికల వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గన్న డాక్టర్ ఉగ్రకు సచివాలయం సిబ్బంది డీఎల్‌డీవోపై ఫిర్యాదు చేశారు. దివ్యాంగుడిని పనిలో ఎలా పెట్టుకొన్నారని కార్యదర్శి పై మండి పడ్డారని తెలిపారు. రాజకీయ నాయకులు చెబితే పెట్టుకొన్నామని చెప్పగా ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పేది ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఉగ్రకు తెలిపారు. సచివాలయ. సిబ్బందికి సెలవులు ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి ఏం అధికారం ఉందని డీఎల్‌డీవో పేర్కొన్నారని తెలిపారు. ఇంటి పన్నుల టార్గెట్ పూర్తి చేయకుండా కార్యాలయంలో బాతాఖాని చేస్తున్నారా అంటూ మండి పడ్డారని ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేశారు.