Share News

విజన్‌ బిల్డింగ్‌తో ప్రయోజనం..అభివృద్ధి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:44 PM

పొదుపు సంఘాల మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళలు ప్రగతి పథంలో ఉంటే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నినదించింది. అలాగే గ్రామ స్థాయిలో ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అంశాలను ప్రణాళిక చేస్తూ విజన్‌-2047 ప్రారంభించి పొదుపు సంఘాల ద్వారా ఆయా గ్రామాల్లో అవసరాలున్న మౌలిక వసతుల కల్పనకు నివేదికను సిద్ధం చేయనున్నారు.

విజన్‌ బిల్డింగ్‌తో ప్రయోజనం..అభివృద్ధి
శిక్షణ ఇస్తున్న ఏసీ సుబ్బారావు

మూడు రోజుల శిక్షణతో బంగారు భవిత

మూడు రోజులుగా శిక్షణ పొందుతున్నాం. దీంతో పొదుపు సంఘాల ఆర్థిక ఉపాధికి వెసులుబాటు ఉంటుంది. అలాగే రుణ సాయం ద్వారా వచ్చిన వడ్డీతో అభివృద్ధికి అవకాశం ఉంటుంది.

- బుజ్జి, సీసీ, సాల్మన్‌ సెంటర్‌ క్లస్టర్‌

2047తో పేదింట చిగురిస్తున్న ఆశలు

చీరాలటౌన్‌, ఫిబ్రవరి15 (ఆంధ్రజ్యోతి) : పొదుపు సంఘాల మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళలు ప్రగతి పథంలో ఉంటే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నినదించింది. అలాగే గ్రామ స్థాయిలో ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అంశాలను ప్రణాళిక చేస్తూ విజన్‌-2047 ప్రారంభించి పొదుపు సంఘాల ద్వారా ఆయా గ్రామాల్లో అవసరాలున్న మౌలిక వసతుల కల్పనకు నివేదికను సిద్ధం చేయనున్నారు. అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం టైలరింగ్‌, వ్యాపార దుకాణాలకు రుణాలను అందించి ఉపాధి అవకాశాలను పెంచనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఫేజ్‌-1లో భాగంగా బల్లికురవ, భట్టిప్రోలు, చీరాల, కొరిశపాడు, ఇంకొల్లు, నిజాంపట్నం, పిట్లవానిపాలెం, రేపల్లె, చుండూరు, యద్దనపూడి, అద్దంకి, అమృతలూరు, చినగంజాం, పర్చూరు మండలాలను ఎంపిక చేశారు. అందుకు అనుగుణంగా గత మూడు రోజులుగా ఎంపికైన మండలాలకు చెందిన వెలుగు ఏపీఎం, సీసీలకు డీఆర్‌డీఏ పీడీ పద్మ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు ఆయా మండలాల్లోని పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి అవసరాలను గుర్తిస్తారు. ఎంపికైన యూనిట్లకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయి. దీంతో సమాఖ్యల అభివృద్ధి సాధ్యమవుతుంది. వీరు పొందిన రుణాల చెల్లింపులో వచ్చిన వడ్డీని పెద్ద మొత్తంలో అభివృద్ధికి ప్రణాళిక చేసేందుకు వీలుంటుంది.

Updated Date - Feb 15 , 2025 | 11:44 PM