Share News

రీ-సర్వేతో సమస్యలు పరిష్కారం కావాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:53 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా భావిస్తున్న రీ-సర్వేతో గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. మండలంలోని బైటమంజులూరు గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను గురువారం స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. రైతుల సహకారంతో రీ-సర్వే ప్రక్రియ న్యాయబద్ధంగా నిర్వహించాలన్నారు.

రీ-సర్వేతో సమస్యలు పరిష్కారం కావాలి
బైటమంజులూరులో రీసర్వేలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

ఆర్డీవో చంద్రశేఖరనాయుడు

పంగులూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా భావిస్తున్న రీ-సర్వేతో గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. మండలంలోని బైటమంజులూరు గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను గురువారం స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. రైతుల సహకారంతో రీ-సర్వే ప్రక్రియ న్యాయబద్ధంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశా రు. అనంతరం నూజెళ్లపల్లి గ్రామంలో ప్రజావేదిక ద్వారా అందిన భూ సమస్యను పరిశీలించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ సింగారావు, సర్వేయర్‌ సురేష్‌, శ్రీనివాసరావు, పలువురు సర్వేయర్లు, వీఆర్వోలు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:53 PM