Share News

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:08 PM

వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశించారు. ఆ దివారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఆర్‌ డబ్ల్యూఎస్‌ జిల్లా, డివిజన్‌ ఉన్నతాధికా రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. సాగర్‌నీటి సరఫరాలో ఏర్పడుతు న్న అంతరాయాలు, వివిధ సమస్యలపై అ ధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి ప్రాం తంలో రానున్న వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణతోపాటు ఫ్లోరోసిస్‌ సమస్య కు శాశ్వత పరిష్కారం లభించేదిశగా అ ధికారులు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వేసవి లో తాగునీటి సరఫరాలో అంతరాయం, సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో నీటి సరఫరా జరిగే మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశం

కనిగిరి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశించారు. ఆ దివారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఆర్‌ డబ్ల్యూఎస్‌ జిల్లా, డివిజన్‌ ఉన్నతాధికా రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. సాగర్‌నీటి సరఫరాలో ఏర్పడుతు న్న అంతరాయాలు, వివిధ సమస్యలపై అ ధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి ప్రాం తంలో రానున్న వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణతోపాటు ఫ్లోరోసిస్‌ సమస్య కు శాశ్వత పరిష్కారం లభించేదిశగా అ ధికారులు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వేసవి లో తాగునీటి సరఫరాలో అంతరాయం, సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. ఫ్లోరోసిస్‌ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి కనిగిరికి సరఫరా అయ్యే పైపులైను మరమ్మతులకు గురైనచోట వెంటనే మార్చాలన్నారు. ఆయా పైపుల స్థానంలో నాణ్యతగా ఉండే పైపులను వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న గ్రా మాలను, పునుగోడు నీటి సరఫరా కేంద్రాన్ని, ప్రభు త్వాసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రాన్ని అర్‌డ బ్ల్యూఎస్‌ అధికారులు ఎమ్మెల్యే సూచనతో ప్రత్యే కంగా సందర్శించారు. మండలంలోని దిరిశవంచ, కమ్మవారిపల్లి, పునుగోడు, ఎస్టీకాలనీ తదితర ప్రాంతాల్లోని నీటి నమూనాలను సేకరించి నివే దిక సిద్ధం చేశారు. సంబంధిత గ్రామాల్లో ఫ్లోరైడ్‌ శాతం 4.9, 3.3, 5.7, పీపీఎంగా ఉన్నట్లు గుర్తిం చినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. సదరు నివేదిక ను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ఆర్‌డబ్యూఎస్‌ ఎస్‌ఈ బా లశంకరరావు, ఈఈ ఎం.సురేష్‌బాబు, డీఈఈ విశ్వనా థరెడ్డి, ఏఈఈ ఎం.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:08 PM