Share News

మైనర్లు వాహనాలు నడిపితే జరిమానా

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:41 PM

మైనర్లు వాహ నాలు నడిపితే రూ.25 వేలు జరిమానా విధిస్తామని డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ అన్నారు. హెల్మెట్‌ధా రణపై పట్టణంలో సోమవారం ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భం గా డీఎస్పీ మాట్లాడుతూ కొంతమంది తమ పిల్లలకు మోటార్‌బైక్‌లు ఇస్తున్నారని చెప్పారు.

మైనర్లు వాహనాలు నడిపితే జరిమానా
హెల్మెట్‌ ధరించి వాహనం నడిపే వారిక గులాబి పువ్దుతో అభినందిస్తున్న పోలీసులు

డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌

కనిగిరి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మైనర్లు వాహ నాలు నడిపితే రూ.25 వేలు జరిమానా విధిస్తామని డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ అన్నారు. హెల్మెట్‌ధా రణపై పట్టణంలో సోమవారం ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భం గా డీఎస్పీ మాట్లాడుతూ కొంతమంది తమ పిల్లలకు మోటార్‌బైక్‌లు ఇస్తున్నారని చెప్పారు. దీంతో వీరు నిబంధనలను ఉల్లంఘించటంతో పాటు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. మైనర్లు ద్విచక్ర వాహ నాలు నడపటం చట్టరీత్యా నేరమన్నారు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్‌ల కుటుంబసభ్యులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారితో పాటు వారితో కలసి వెళ్ళేవా రు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌ ధరించ కుండా వాహనాలు నడిపే వారి బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు లు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. జరిమానాలు మూడుకు మించి ఉంటే వారి లైసె న్స్‌ రద్దు చేస్తామని చెప్పారు. హె ల్మెట్‌ ధరించి నడిపే వారికి పోలీ సులు గులాబి పువ్వు ఇచ్చి అభినం దిస్తూ పట్టణంలో అవగాహన ర్యా లీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ ఖాజావలి, ఎస్‌ఐ మాధవ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:42 PM