Share News

అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:41 PM

వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలనుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ అన్సారియా మాట్లాడుతూ వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరగా పరిష్కరించాలన్నారు.

అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మీకోసంలో అర్జీదారు సమస్యను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలనుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ అన్సారియా మాట్లాడుతూ వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని ఆడిటింగ్‌ చేయడం జరుగుతుందని, అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షిస్తామన్నారు. అర్జీలు రీ ఓపెన్‌ అయినట్లు అయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్‌లో ఉండకూడదన్నారు. అధికారులు రోజూ లాగిన్‌ అయ్యి అన్‌లైన్‌లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపుతూ రీ ఓపెన్‌ కేసులు రాకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, రెవెన్యూ అధికారి ఓబులేషు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్‌, పార్థసారథి, జాన్సన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

ఫ అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసంఘం నాయకులు వడ్డె హనుమారెడ్డి, సుధాకర్‌నాయుడు, శ్రీనులు కలెక్టర్‌ను కోరారు.

ఫ 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌తో జరిగిన ఒప్పందం మినిట్స్‌ను అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు దుర్గా మస్తాన్‌వలి, గాలిరెడ్డి, కే ఆదాంలు కోరారు.

Updated Date - Feb 24 , 2025 | 11:41 PM