Share News

క్రికెట్‌లో రాణిస్తున్న పామూరు విద్యార్థి

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:04 PM

క్రికెట్‌ లో పామూరు విద్యార్థి రాణిస్తున్నాడు. చిత్తూరు జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఎ స్వీ జూనియర్‌ కళాశాల తరుపున కెప్టెన్‌గా వ్యవహరించి విజేతగా నిలిచారు. పామూరు పంచాయతి పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు, పరిమిళ దంప తుల ఏకైక కూమారుడు అభినంద్‌ పదో తరగతి వరకు పామూరులో చదివాడు. తిరుపతి ఎస్వీ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.

క్రికెట్‌లో రాణిస్తున్న  పామూరు విద్యార్థి
అభినంద్‌

పామూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ లో పామూరు విద్యార్థి రాణిస్తున్నాడు. చిత్తూరు జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఎ స్వీ జూనియర్‌ కళాశాల తరుపున కెప్టెన్‌గా వ్యవహరించి విజేతగా నిలిచారు. పామూరు పంచాయతి పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు, పరిమిళ దంప తుల ఏకైక కూమారుడు అభినంద్‌ పదో తరగతి వరకు పామూరులో చదివాడు. తిరుపతి ఎస్వీ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోటీలో ఎస్వీ కళాశాల జట్టు, ఎమరాల్డ్‌ జట్టు తలపడ్డాయి. అభినంద్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన ఎస్వీ కళాశాల విజేతగా నిలిచింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఎస్వీ కళాశాల జట్టు కప్‌ అందుకుంది. ఈసందర్భంగా అభినంద్‌ కు తల్లిదండ్రులతో పాటు పామూరు, గోపాలపురం గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 11:04 PM