Share News

7న హైదరాబాద్‌లో ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:45 PM

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వ ర్యంలో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే లక్ష డప్పులు.. వేల గొం తుల కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని ఆ సంఘ నగర అధ్యక్షులు గుంటూరి ప్రభుదా స్‌ కోరారు.

7న హైదరాబాద్‌లో ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’

ఎమ్మార్పీఎస్‌ నగర అధ్యక్షుడు ప్రభుదాస్‌

ఒంగోలు కార్పొరేషన్‌, జనవరి 30 (ఆంధ్రజ్యో తి): మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వ ర్యంలో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే లక్ష డప్పులు.. వేల గొం తుల కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని ఆ సంఘ నగర అధ్యక్షులు గుంటూరి ప్రభుదా స్‌ కోరారు. గురువారం ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని, నగర కమిటీ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్న ట్లు తెలిపారు. అలాగే వర్గీకరణ సాధన కోసం భారీగా చేపట్టిన లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమం ఎమ్మార్పీఎస్‌ పోరాట ఉద్యమంలో మరోసారి చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతుం దని చెప్పారు. ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యం లో సుమారు 300 డప్పులతో వేయి మంది మాదిగ సోదరులతో కలిసి పాల్గొంటున్నట్లు చె ప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇ చ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశా రు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తిరు వీధుల బాబు, జండ్రాజుపల్లి ఆంజనేయులు, రా జబాబు, రమేష్‌, రవికుమార్‌, తేజ, అంకయ్య, గుంటూరి రజని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:45 PM