ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:49 PM
ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం ఎన్టీ ఆర్ వర్ధంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో, నం దనమారెళ్ళ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మె ల్యే పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసంద ర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ఏ రంగంలోనైనా తనదైన ముద్రతో ప్రజల అభిమానాల్ని పొంది వారి గుండెల్లో చిర స్థానాన్ని సంపాదించుకున్న అజరామరుడు ఎన్టీయార్ అని అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు
పలుచోట్ల అన్నదానాలు
కనిగిరి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం ఎన్టీ ఆర్ వర్ధంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో, నం దనమారెళ్ళ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మె ల్యే పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసంద ర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ఏ రంగంలోనైనా తనదైన ముద్రతో ప్రజల అభిమానాల్ని పొంది వారి గుండెల్లో చిర స్థానాన్ని సంపాదించుకున్న అజరామరుడు ఎన్టీయార్ అని అన్నారు. సి నీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టిన మహామనిషి ఎన్టీఆర్ అ ని కొనియాడారు. ఎన్టీఆర్ కలలు గన్న ఆశయాలను చంద్రబాబు తీరుస్తూ పార్టీని మరింత బలోపేతం చేశారన్నారు. తొలుత ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు నారపరెడ్డి (యడవల్లి)శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, గుదే రమణయ్య, విజయభాస్కర్‌రెడ్డి, నజిముద్దీన్, సుబ్ర మణ్యం, నంబుల వెంకటేశ్వర్లు, తిరుపాలు, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎండ్లూరి సాల్మన్‌రాజు (వైఎస్సార్ ) రోడ్డులో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈసందర్భంగా యాచకులకు పండ్లు, అల్పాహారాన్ని అందజేశా రు. కార్యక్రమంలో యస్థాని (పులి) బాషా, తాతపూడి ఐజక్, బ్రాక్, గిఫ్ట్ ఆర్టికల్స్ కొండలు, ఉంగరాల భాషా, బడేబాయి, తదితరులు పాల్గొన్నారు.
పామూరులో.. పామూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తెలుగువారి గుండెల్లో మరణం లేని మహమనిషిగా ఎన్టీఆర్ ముద్ర వేసుకొన్నారని ఎ మ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడు కలను మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సత్యదేవుని కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని రక్తదానం చేశారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో టీడీటీ మండల, పట్టణ అధ్యక్షులు పు వ్వాడి వెంకటేశ్వర్లు, షేక్ ఖాజారహంతుల్లా, ఎంపీటీసీ బొల్లా నరసింహా రావు యారవ శ్రీను, డీవీ మనోహర్, మోపాడు ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్‌లు చుంచు కొండయ్య, ఎం.నరసింహారావు, బీజేపీ నాయకుడు కేవీ రమణయ్య, జనసేన నాయకులు వై.రహీముల్లా, దరిశి ఏడుకొండలు, తదిదరులు పాల్గొన్నారు.
మంచిచేసేవారిని గుర్తించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర అన్నారు. మం డలంలోని రేగిచెట్లపల్లిలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తుల మస్తాన్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు సమస్యలపై గ్రామస్థులు వినతిపత్రాలు అందజే శారు. అనంతరం మహిళలకు చీరెలు పంపిణి చేశారు. గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పీసీపల్లిలో.. పీసీపల్లి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పలు సంక్షేమ పథకాలు అమలుచేసి పేదల గుండెల్లో స్థిరంగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య అ న్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పీసీపల్లి బస్టాండు సెంటరులో ఆయన విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలువేసి నివాళులర్పిం చా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య, గోగడి రత్నయ్య, వీరపనేని పెద్దన్న, మూలె సత్తిరెడ్డి, కోమటిగుంట్ల వీరయ్య, జనసేన మండల అధ్యక్షుడు బండారు రాజు, మాదాసు రమేష్, కసిరెడ్డి హనుమారెడ్డి, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వెలిగండ్లలో.. వెలిగండ్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛమైన రాజకీ యాలకు స్ఫూర్తి ప్రదాతగా ఎన్టీఆర్ నిలిచారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తెలుగురైతు నియోజకవర్గ అధ్యక్షుడు కేలం ఇం ద్ర బూపాల్‌రెడ్డి అన్నారు. వెలిగండ్లలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయ కులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొండు భాస్కర్‌రెడ్డి, గవదకట్ల హరి, గొనా ప్రతాప్, బీరం వెంకటేశ్వర రెడ్డి, మీనిగా కాశయ్య, కసునూరి మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు
దర్శి : తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. శనివారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరా ములు విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక పీజీఎన్ క్లబ్ ఆవరణలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతుల ఆధ్వర్యంలో పేదలకు అ న్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌చైర్మన్ జి.స్టీవెన్, కౌన్సిలర్ వీసీ రెడ్డి, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య, దామా కృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, పుల్లలచెరువు చిన్నా, కె.వెలుగొండారెడ్డి, ఎం.శోభారాణి, సంగా తిరుపతిరావు, దారం సుబ్బారావు, బొట్ల కోటేశ్వర రావు, గొర్రె సుబ్బారెడ్డి, గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దొనకొండలో.. దొనకొండ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దొనకొండలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ తెలు గువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహనీయుడు ఎ న్టీఆర్ అని కొనియాడారు. అనంతరం కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వర రావు, మాజీ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ పులిమి రమణాయాదవ్, నాయకులు వడ్లమూడి చెన్నయ్య, మండ్లా అంతోని పీటర్, వడ్లమూడి వెంకటాద్రి, డాక్టర్ మల్లికార్జునశర్మ, కొత్తం రఘునా థరెడ్డి, మన్నెం గాలెయ్య, కొమ్మతోటి సుబ్బారావు, యరగొర్ల బసవయ్య, నిమ్మకాయల సుబ్బారెడ్డి, మోడి పెద్దఆంజనేయులు, శృంగారపు నాగసు బ్బారెడ్డి, దుగ్గెంపూడి చెంచయ్య, కుందుర్తి లక్ష్మణ్, పోతిపోగు చెన్నయ్య, బండారు శ్రీను, పెమ్మసాని లక్ష్మీనారాయణ, తోటా వెంకటేశ్వర్లు, ఫణిదపు వీరాంజనేయులు, అంకాల మల్లికార్జున(మల్లీ), వల్లపునేని కేశవ, షేక్ ముసామియా, షేక్ సుభానీ తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరులో..ముండ్లమూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం ముండ్లమూరు బస్టాండ్‌ల సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కోటి మంది సభ్యత్వాలు దాటిని పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీయేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ వేముల పద్మ, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగ రాజు, వరగాని పౌలు, డీసీ చైర్మన్‌లు కంచుమాటి శ్రీనివాసరావు, సందాడి సుబ్బారావు, సర్పంచ్‌లు కూరపాటి నారాయణ స్వామి, గజ్జల సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కురిచేడులో.. కురిచేడు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తెలుగువారి కీర్తిని ఎలుగెత్తి చాటిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పిడతల పెమిలయ్య, కాట్రాజు నాగరాజు, డాక్టర్ సునీల్, మొఘల్ మస్తాన్ వలి, కమతం నాగిరె డ్డి, బాలయ్య, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు : పేదల సంక్షేమానికి ఆ ద్యుడుగా ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపో యారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ .ప్ర స్తుత సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ బాటలో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అనంతరం అన్నదానం నిర్వహంచారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లలిత్‌సాగర్, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మానం రమేష్‌బాబు, శాగం కొండారెడ్డి, షేక్ కాలేషావలి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఐ.శ్రీనివాసరెడ్డి, టి.శివనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే, తూర్పుగంగవరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వల్లభనేని సుబ్బయ్యలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని సుబ్బయ్య, శాగం కొండారెడ్డి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, షేక్ కాలేషావలి, షేక్ మీరామొహిద్దీన్, మన్నేపల్లి సమర, తదితరులు పాల్గొన్నారు.
కాగా, మండలంలోని కొర్రపాటివారిపాలెం టీడీపీ శ్రేణులు తాళ్లూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడకలు దూరంగా ఉండటం చర్చ నీయాంశమైంది. హైవేరోడ్డు నిర్మాణ నిర్వాహకులు కొండ మట్టిని అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈక్రమంలో గ్రామ టీడీపీ నాయకులకు, నియోజకవర్గ ముఖ్యనేతకు కొంత దూరం వచ్చినట్లు తెలిసింది. అమితుచ టీడీపీకి చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్, రాష్ట్ర తెలుగుయువత నాయకులు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.
ముండ్లమూరు : మండలంలోని బసవా పురంలో ఉపసర్పంచ్ కట్టా చిన వెంకంబొట్లు, కట్టా బ్రదర్స్ ఏర్పాటుచేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని శనివారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మిషన్ వైస్‌చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కడియాల లలిత సాగర్, సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస రావు, మాజీ జడ్పీటీసీలు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, కట్టా ముస లయ్య, తదితరులు పాల్గొన్నారు.