Share News

16న జాతీయ స్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:55 PM

ఆర్‌బీ డ్రాగన్స్‌ షుటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన స్థానిక గీతామందిర్‌లో జాతీయ స్థాయిలో ఓపెన్‌ కరాటే కుంగ్‌ఫు, టైక్వాండో చాంపియన్‌షి్‌ప పోటీలు జరుగుతాయని పోటీల చీఫ్‌ ఆర్గనైజర్‌ పీ రాంబాబు తెలిపారు. బుధవారం స్థానిక చిన్ని మురళీ కృష్ణ ఆఫీ్‌సలో పోటీలకు సంబంధించి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

16న జాతీయ స్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

హాజరు కానున్న మంత్రి రవికుమార్‌, సినీనటుడు సుమన్‌

అద్దంకిటౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఆర్‌బీ డ్రాగన్స్‌ షుటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన స్థానిక గీతామందిర్‌లో జాతీయ స్థాయిలో ఓపెన్‌ కరాటే కుంగ్‌ఫు, టైక్వాండో చాంపియన్‌షి్‌ప పోటీలు జరుగుతాయని పోటీల చీఫ్‌ ఆర్గనైజర్‌ పీ రాంబాబు తెలిపారు. బుధవారం స్థానిక చిన్ని మురళీ కృష్ణ ఆఫీ్‌సలో పోటీలకు సంబంధించి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతు ఈ పోటీలకు 8 రాష్ర్టాల నుంచి సుమారు 700 మంది పొల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సినీ హీరో సుమన్‌ హాజరవుతారని తెలిపారు. అసోసియేషన్‌ ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్‌ జి.సాయిరాం ఇతర అధికారుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అద్దంకిలో 40 సంవత్సరాల కిందట కరాటే మాస్టర్‌గా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు జాతీయ స్థాయి చీఫ్‌ ఆర్గనైజర్‌ స్థాయికి చేరి, ప్రస్తుతం తన స్వస్థలం అద్దంకిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం అని కరాటే రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని మురళికృష్ణ అన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కరాటే మాస్టర్‌ వెంకటరత్నం, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:55 PM