Share News

వెలుగు పీడీగా నారాయణ

ABN , Publish Date - Feb 13 , 2025 | 02:02 AM

డీఆర్‌ డీఏ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌గా టి.నారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పీడీగా పనిచేసిన వసుంధర కొద్ది నెలల క్రితం బదిలీపై ఇతర జిల్లాకు వెళ్లారు.

వెలుగు పీడీగా నారాయణ

త్వరలో బాధ్యతల స్వీకరణ

ఒంగోలు (రూరల్‌), ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : డీఆర్‌ డీఏ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌గా టి.నారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పీడీగా పనిచేసిన వసుంధర కొద్ది నెలల క్రితం బదిలీపై ఇతర జిల్లాకు వెళ్లారు. అనంతరం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రవికుమార్‌ ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన కూడా బదిలీ కావడంతో ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న నారాయణను నియమించింది. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 02:02 AM