Share News

నేటి నుంచి మహాలక్ష్మి నవరాత్రి కొలుపు మహోత్సవాలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:22 PM

మండలంలోని చందలూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి కొలుపు మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదున్నర శతాబ్దాల నాడు కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా, ఇష్ట దైవంగా కొలిచే గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. మూడేళ్లకోసారి జరిగే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థుల సహకారంతో ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది.

నేటి నుంచి మహాలక్ష్మి నవరాత్రి కొలుపు మహోత్సవాలు

చందలూరులో కొలువైన అమ్మవారు

ఏర్పాట్లు చేస్తున్న వంశస్థులు

పంగులూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చందలూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి కొలుపు మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదున్నర శతాబ్దాల నాడు కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా, ఇష్ట దైవంగా కొలిచే గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. మూడేళ్లకోసారి జరిగే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థుల సహకారంతో ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. 8, 9 తేదీలలో మానుపూజ నిర్వహించి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారి ఆహ్వాన సంకల్పం తీసుకోవడం, ముత్తయిదువులకు పంచ మాంగళ్యాల పంపిణీ అనంతరం 10వ తేదీ అర్ధరాత్రి నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుందని గణాచారి బ్రహ్మశ్రీ వేదమూర్తివర్యులు చల్లా సత్యనారాయణ శాస్రి తెలిపారు. గ్రామస్థులు, భక్తుల సిధ్యానుసారం మూడేళ్లకోసారి జరిగే ఈ కొలుపు మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

10 అర్ధరాత్రి నుంచి 17వ తేదీ వరకు గ్రామోత్సవం

మానుపూజతో ప్రారంభమయ్యే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు మహోత్సవంలో 10 అర్ధరాత్రి నుంచి జరిగే అమ్మవారి ఊ రేగింపు మహోత్సవంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్దేశిత పుర వీధులలో ఈ ఉత్సవం కొనసాగుతుంది. తమ కోర్కేలు తీర్చే ఇలవేల్పుగా భావించే భక్తు లు అమ్మవారి విగ్రహంతో బయలుదేరిన గణాచారికి అభిముఖంగా వేలాది మంది అమ్మవారికి పూలు, తమలపాకులు సమర్పిస్తూ వెనుకు నడుస్తూ సాగే వేడుకతో నిత్యం గ్రామంలో పండుగ వాతావర ణాన్ని తలపిస్తుంది. ఈ ఉత్సవంలో రోజ కు ఒకరు వంతున (చిట్టాబత్తిన, మురకొండ, పాలేరు, కళావంతులు, గొట్టిపాటి, పుల్లెల) వంశస్తులు నిర్వహించే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో వేరు వేరు ప్రాం తాలు, పట్టణాలలో స్థిరపడిన వారితో పాటు పలు రాష్టాల ప్రజలు తమ మొక్కులు తీర్చుకునేందుకు చందలూరు చేరుకోవడంతో వారం రోజలుల పాటు గ్రామం జన సందోహంతో తిరుణాళ్లను తలపిస్తుంది. 18వ తేదీన మహాలక్ష్మి అమ్మవారికి పొంగళ్ల సమర్పణతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

Updated Date - Jan 07 , 2025 | 11:22 PM