జాబ్ కార్డుదారులకు పని కల్పించాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:36 AM
ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డుఉన్న ప్రతిఒక్కరికి పని కల్పించాలని డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్ పీల్డ్ అసిస్టెం ట్‌లను ఆదేశించారు. గురువారం మండ లంలోని సుంకరవారిపాలెంలో జరుగుతు న్న ఉపాధి హామీ పనులను ఆయన పరి శీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ రూ.300 వేతనం పడేటట్టుగా కూలీలు పని చేయాలన్నారు.

డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్
సుంకరవారిపాలెంలో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్
ముండ్లమూరు, మార్చి 6 (ఆంధ్ర జ్యోతి): ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డుఉన్న ప్రతిఒక్కరికి పని కల్పించాలని డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్ పీల్డ్ అసిస్టెం ట్‌లను ఆదేశించారు. గురువారం మండ లంలోని సుంకరవారిపాలెంలో జరుగుతు న్న ఉపాధి హామీ పనులను ఆయన పరి శీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ రూ.300 వేతనం పడేటట్టుగా కూలీలు పని చేయాలన్నారు. పని ప్రదేశంలో వడ దెబ్బకు గురి కా కుండా ఉండేందుకు షామియానాలు, మంచినీరు ఉం చాలన్నారు. ప్రతిరోజు మండలంలో 3500 నుంచి పది వేలలోపు కూలీలు పనికి వచ్చేవిధంగా చూడాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాల న్నారు. జాబ్ కార్డు ఉన్న వారి స్థానంలో ఒకరికి బ దులు, మరొకరు పని చేయటానికి వీల్లేదన్నారు. పని ప్రదేశంలోనే హాజరు తీసుకోవాలన్నారు. ప్రతి రైతు పొ లంలో ఫారం ఫాండ్స్ నిర్మించుకొనే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. మండలంలో వెయ్యి ఫారం ఫాండ్స్ లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు.
పండ్ల తోటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీ కూడా కల్పిస్తుందన్నారు. పశుపోషకులు ముం దుకు వచ్చినట్లయితే ఎక్కువ గోకులం షెడ్లు మంజూ రు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలనూ ఉపాధి నిధులతో చేపడుతున్నట్టు చెప్పా రు. కార్యక్రమంలో ఏపీడీ ఆర్.లలితకుమారి, ఏపీవో కె. నాగరాజు, ఈసీ శివరామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్‌లు నాగార్జున, బలరామ్, శ్రీనివాసులు, భారతి, ఫీల్డ్ అ సిస్టెంట్‌లు రామలక్ష్మయ్య, నందయ్య తదితరులు పా ల్గొన్నారు.
కోనేరు అభివృద్ధికి చర్యలు
తాళ్లూరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పవిత్రపుణ్యక్షేత్రమైన గుంటిగంగ సన్నిధిలో పాడుబడ్డ కోనేరును అభి వృద్ధిచేసి పూర్వవైభవం తీసు కువస్తామని డ్వామా పీడీ జో సెఫ్‌కుమార్ తెలిపారు. మండలంలో గుంటిగంగ సన్నిధిలో నిరుపయోగంగా ఉన్న కోనేరు ను గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆల య కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మాట్లాడుతూ గ తంలో కోనేరు నిత్యం ప్రవహి స్తూ ఉండేదన్నారు. గత కొంతకాలంగా కోనేరు పూడిపోయిందన్నారు. ఉపాధి పథకం ద్వారా నిధులు సమకూర్చి కోనేరు, పక్కనున్న పెద్దకుంటలో పూడిక తీతపనులు చేయించాలన్నారు. కోనేరుకు పూర్వవైభవం తీసు కురావాలని కోరారు. దీనిపై స్పందించిన పీడీ జోసెఫ్ కోనేరులో పూడికతీత పనులకు అంచనాలు తయారు చేసి పంపాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ లతితకుమారి, ఈసీ గురుబాబు, టీఏ కోటేశ్వరరావు, ఎఫ్‌ఏ చాట్ల డానీ, తదితరులు పాల్తొన్నారు. పవిత్రపుణ్యక్షేత్రమైన గంగమ్మను డ్వామా పీడీ జోసెఫ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గురుబ్రహ్మం పీడీని శాలువాతో సత్కరించారు.