Share News

పవన్‌కల్యాణ్‌పై జగన్‌ వ్యాఖ్యలు గర్హనీయం

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:38 AM

డిప్యూటీ సీ ఎం పవన్‌కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపూడి విజయ్‌బాబు ధ్వజమెత్తారు.

 పవన్‌కల్యాణ్‌పై జగన్‌ వ్యాఖ్యలు గర్హనీయం

మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయ్‌బాబు

చీమకుర్తిలో జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన జనసేన పార్టీ నేతలు

చీమకుర్తి, మార్చి6(ఆంధ్రజ్యోతి) : డిప్యూటీ సీ ఎం పవన్‌కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపూడి విజయ్‌బాబు ధ్వజమెత్తారు. చీమకుర్తి బస్టాండ్‌ సెంటర్‌లో గురువారం సాయంత్రం జగన్‌మోహన్‌ రెడ్డి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు దహ నం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చైర్మన్‌ అజయ్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి కందుకూరి బాబు, పార్టీ మండల అధ్యక్షుడు పల్లపు శివప్రసాద్‌ మాట్లాడా రు. ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11సీట్లకు పడిపోవ టంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్న అసహనంలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని విమర్శి ంచారు. తమ ఆరాధ్య నాయకుడు పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల ప్రజలను మనస్థా పానికి గురి చేశాయన్నారు. మొదటిసారి కాబట్టి నిరసనలతో సరిపెడుతున్నామని, మరోసారి తమ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. పేటీఎం బ్యాచ్‌ తోకముడవటంతో చేసేదేమి లేక జగన్‌మోహన్‌రెడ్డినే స్వయంగా రం గంలోకి దిగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కార్య క్రమంలో పట్టణ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్‌, నా యకులు ముత్యాల సురేష్‌, షేక్‌ యాసిన్‌, జొన్నల గడ్డ కోటి, వాసుబాబు, మురళి, వెంకట్రావు, కోటే శ్వరరావు, చంద్రశేఖర్‌, బ్రహ్మయ్య,రాజేష్‌, పి.వెంక ట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:38 AM