Share News

సాగునీరు, రైతుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:25 PM

నియోజకవర్గం పరిధిలోని సాగునీటి సరఫరా, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నా రు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు కెనాల్‌ నుంచి సాగుకు అందుతున్న నీటికి సంబంఽధించిన సబ్‌ కెనాల్స్‌ దెబ్బతిన్నట్లు సభ దృష్టికి తీసుకు వచ్చారు. తూటాకు పేరుకుపోయి సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన వివరించారు.

సాగునీరు, రైతుల సమస్యలు పరిష్కరించండి

గత వైసీపీ రివర్స్‌ టెండరింగ్‌తో ఒరిగిందేమీ లేదు

అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గం పరిధిలోని సాగునీటి సరఫరా, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నా రు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు కెనాల్‌ నుంచి సాగుకు అందుతున్న నీటికి సంబంఽధించిన సబ్‌ కెనాల్స్‌ దెబ్బతిన్నట్లు సభ దృష్టికి తీసుకు వచ్చారు. తూటాకు పేరుకుపోయి సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన వివరించారు. దెబ్బతిన్న కాలువలను సాధారణ స్థితికి చేర్చడానికి నిధులు లేవన్నా రు. అంతేకాకుండా గత వైసీపీ పాలకులు రివర్స్‌ టెండరింగ్‌తో రైతులకు ప్రయో జనం శూన్యమన్నారు. టీడీపీ కూటమి రాకతో ఇప్పటికే కొంతమేరకు రైతులకు సహాయం అందించినట్లు చెప్పారు. అయితే ఖరీ్‌ఫకు చేరేలోగా నియోజకవర్గానికి అనుకూలంగా ఉన్న ఐదు ఎత్తుపోతల పథకాలకు మరమ్మతులు చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. ఇవి సాధారణ స్థితికి చేర్చితే పట్టణానికి కూడా తాగునీరు అందించవచ్చని చెప్పారు. ఈ క్రమంలో ఆయా మరమ్మతులకు నిధులు కేటాయించి రైతులకు సహకరించాలని కొండ య్య అసెంబ్లీలో మాట్లాడారు.

తీరనున్న తాగునీటి సమస్యలు

నియోజకవర్గం ప్రజలకు ఇకపై తాగునీటి సమస్యలు ఉండవని ఇది శుభ పరిణామమని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాలలో తాగునీటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించి బుధవారం జలజీవన్‌ మిషన్‌ ద్వారా చీరాల పరిధిలో 18 వ ర్క్‌లకు రూ.6.10 కోట్లు, వేటపాలెంలో 16 వర్క్‌లకు రూ.4.62 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 05 , 2025 | 11:25 PM