అస్తవ్యస్తంగా తాగునీటి సరఫరా
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:10 PM
ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. తాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా జరుగు తుండటంతో అనేక గ్రామాలకు మంచినీరు సక్రమంగా అందటం లేదు. కా లంచెల్లిన పైపులైన్లు పగిలిపోవటంతో నీటి సరఫరాకు ఇబ్బంది కల్గుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు దర్శి పట్టణానికి వచ్చి బబూ ల్స్‌లో మంచినీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

దర్శి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. తాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా జరుగు తుండటంతో అనేక గ్రామాలకు మంచినీరు సక్రమంగా అందటం లేదు. కా లంచెల్లిన పైపులైన్లు పగిలిపోవటంతో నీటి సరఫరాకు ఇబ్బంది కల్గుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు దర్శి పట్టణానికి వచ్చి బబూ ల్స్‌లో మంచినీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా మండలంలోని తూర్పుచౌటపాలెం, సామంతపూడి, నిమ్మారెడ్డిపాలెం గ్రామా లకు మంచినీరు సక్రమంగా సరఫరా రావడం లేదు. వారంలో ఒకటి, రెం డు రోజులు మాత్రమే అరకొరగా విడుదల చేస్తున్నారు. దీంతో ఆ గ్రామాల కు చెందిన మహిళలు దర్శికి వచ్చి బబూల్స్‌లో నీరు పట్టుకొని తీసుకెళ్లే దుస్థితి నెలకొంది. వేసవికాలం వస్తుండటంతో సంబంధిత అధికారులు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే పరిస్థితి నెలకొంటుంది.