యద్దనపూడి మండలంలో విద్యుత్ అధికారుల తనిఖీలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:49 PM
యద్దనపూడి మండలంలో విద్యుత్ అధికారుల బృందాలు గు రువారం గ్రామాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 43 విద్యుత్ సర్వీసులకు చెందిన వారు విద్యుత్ అధిక లోడు వినియోగిస్తున్నారని వారికి 1 లక్షా 23 వేల రూపాయలను పెనాల్టీగా విధించినట్లు బాపట్ల ఏపీసీపీడీసీఎల్ సూపరిం టెండెంట్ ఇంజనీర్ జీ ఆంజనేయులు తెలిపారు.

యద్దనపూడి, (మార్టూరు) ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : యద్దనపూడి మండలంలో విద్యుత్ అధికారుల బృందాలు గు రువారం గ్రామాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 43 విద్యుత్ సర్వీసులకు చెందిన వారు విద్యుత్ అధిక లోడు వినియోగిస్తున్నారని వారికి 1 లక్షా 23 వేల రూపాయలను పెనాల్టీగా విధించినట్లు బాపట్ల ఏపీసీపీడీసీఎల్ సూపరిం టెండెంట్ ఇంజనీర్ జీ ఆంజనేయులు తెలిపారు. గ్రామాలలో విద్యుత్ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించిన తర్వాత యద్దనపూడి విద్యుత్ కార్యాల యం వద్ద అధికారులతో కలిసి ఎస్‌ఈ ఆంజనేయులు విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. దొంగతనంగా విద్యుత్ ను వినియోగించడం, అక్రమ పద్ధ తులు ద్వారా విద్యుత్‌ను వినియోగించాలనుకోవడం నేరమన్నారు. నెలవారీ బిల్లు లు వెంటనే చెల్లిస్తే పెనాల్టీలే ఉండవన్నారు. కరెంటు మీటర్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి మీటరును అందచేస్తామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని అందరూ వి నియోగించుకోవాలన్నారు. తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఈ మల్లికార్జునరావు, అద్దంకి ఈఈ మస్తానరావు, యద్దనపూడి ఏఈ టీ సురేష్ బా బు, పలువురు విద్యుత్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.