Share News

బోగస్‌ పింఛన్లపై విచారణ

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:40 AM

బోగస్‌ పింఛన్ల పొందిన వారిని గుర్తించేం దుకు వైద్యుల బృందం సోమవారం విచారిం చింది.

బోగస్‌ పింఛన్లపై విచారణ

గిద్దలూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బోగస్‌ పింఛన్ల పొందిన వారిని గుర్తించేం దుకు వైద్యుల బృందం సోమవారం విచారిం చింది. రాచర్ల మండలంలో మంచానికి లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన 22 మంది నెలకు 15వేల రూపాయల వంతున ఫించన్లు పొందుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది అనర్హులని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యుల బృందం సోమవారం విచారించింది. పింఛన్‌ దారుల ఇళ్లకు నేరుగా వైద్యబృందం వెళ్లింది. బృందం సభ్యులైన డాక్టర్‌ టి.విద్యాసంజీవ్‌, డాక్టర్‌ ఎస్‌.గిరిరాజు, స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌ తో కలిసి పక్షవాతంతో బాధపడుతూ మంచా నికి లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారిని విచారించారు. నివేదికలను ఉన్నతాధికారు లకు పంపుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

కంభం : గత ప్రభుత్వ హయాంలో బోగస్‌ సర్టిఫికేట్లతో నెలకు రూ.15వేలు పింఛన్‌ పొందుతున్న వారిని పరీక్షించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు సోమవారం అర్థవీడు మండ లంలో ఎంపీడీవో నరసయ్య ఆధ్వర్యంలో రూ.15వేలు పింఛన్‌ పొందుతున్న వారిని ముగ్గురు వైద్యుల బృందం పరిశీలించింది. ఈ సంద ర్భంగా ఎంపీడీవో నరసయ్య మాట్లా డుతూ మండలంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన దివ్యాంగులు మొత్తం 17 మంది ఉండగా వీరిలో ఒకరు గత ఏడాది చని పోయారని, మిగిలిన 16 మందిలో వెలగలపాయలో ఉన్న ఏడుగురిని, అర్ధవీడు లోయ లో ఉన్న తొమ్మిది మందిని డాక్టర్‌ సీతారామిరెడ్డి, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ లక్ష్మి పరీక్షించినట్లు తెలిపారు. దివ్యాంగుల పరిస్థితిని డాక్టర్లు మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ఈ తనిఖీలో వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నట్లు తెలిపారు.

పెద్ద దోర్నాల : మండలంలోని మంచానికి పరిమితమై రూ.15,000లు పింఛన్లు పొందు తున్న లబ్ధిదారుల స్థితిగతులను వైద్యాధి కారుల బృందం సోమవారం పరిశీలించింది. మండలంలో 12 మంది లబ్ధిధారులు ఆ పింఛనును పొందుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీవో ఎం నాసర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యాధికారి సయ్యద్‌ అబ్దుల్‌ కలాం, వి.సాయికిరణ్‌, శంకర్‌రెడ్డి, సీహెచ్‌వో రాజేశ్‌, సచివాలయం సిబ్బంది ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పరిశీలనలో పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:40 AM