Share News

మైనర్‌ కాలువ అభివృద్ధికి శ్రీకారం

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:49 PM

మండలంలోని ఉప్పుమాగులూరు గ్రామంలో పంటలు సాగు చేసిన రైతులు సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నీటి సంఘం డీసీ వైస్‌ చైర్మన్‌ కక్కెర సుబ్బారావు దృష్టికి రైతులు తీసుకు వెళ్లారు. ఆ విషయాన్ని అయన మంత్రి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లి అయన ఆదేశాలతో గురువారం సుబ్బారావు సొంత నిధులు వెచ్చించి పసుమర్రు మేజర్‌ కాలువ నుంచి వెళ్లే ఉప్పుమాగులూరు మైనర్‌ కాలువ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

మైనర్‌ కాలువ అభివృద్ధికి శ్రీకారం
ఉప్పుమాగులూరులో మైనర్‌ కాలువను అభివృద్ధి చేయిస్తున్న సుబ్బారావు

మంత్రి గొట్టిపాటి ఆదేశం

సొంత నిధులతో పనులు చేపట్టిన నీటి సంఘం వైస్‌ చైర్మన్‌ సుబ్బారావు

బల్లికురవ. జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఉప్పుమాగులూరు గ్రామంలో పంటలు సాగు చేసిన రైతులు సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నీటి సంఘం డీసీ వైస్‌ చైర్మన్‌ కక్కెర సుబ్బారావు దృష్టికి రైతులు తీసుకు వెళ్లారు. ఆ విషయాన్ని అయన మంత్రి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లి అయన ఆదేశాలతో గురువారం సుబ్బారావు సొంత నిధులు వెచ్చించి పసుమర్రు మేజర్‌ కాలువ నుంచి వెళ్లే ఉప్పుమాగులూరు మైనర్‌ కాలువ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతులు మిర్చి, పొగాకు, వరి పంటలు సాగు చేయగా మేజర్‌ ద్వారా వచ్చే నీరు కాలువలో చిల్ల కంప ఉండడంతో ముందుకు కదలడం లేదు. దీంతో డీసీ వైస్‌ చైర్మన్‌ సహకారాంతో మైనర్‌ కాలువలో ఉన్న పూడిక పనులు శరవేగంగా చేపడుతున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో రైతులు, మరియు టీడీపీ నేతలు దేవినేని నరేంద్ర, అమరనేని వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:49 PM