ఖోఖో పోటీలలో భారత్ సత్తా చాటాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:58 PM
జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ప్రపంచ స్థాయి ఖోఖో పోటీలలో భారత్‌జట్లు సత్తా చాటి విజేతగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బీసీహెచ్ గరటయ్య ఆకాంక్షించారు. పంగులూరు ఎంఎస్‌ఆర్ అండ్ బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలోని ఎస్‌ఆర్‌ఆర్ అకాడమీలో ఢిల్లీ కేంద్రంగా నిర్వహించబోతున్న ప్రపంచ కప్ ఖోఖో పోటీల లోగోను సోమవారం డాక్టర్ గరటయ్య ఆవిష్కరించారు.

అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ గరటయ్య
ప్రపంచ కప్ ఖోఖో పోటీల లోగో ఆవిష్కరణ
పంగులూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ప్రపంచ స్థాయి ఖోఖో పోటీలలో భారత్‌జట్లు సత్తా చాటి విజేతగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బీసీహెచ్ గరటయ్య ఆకాంక్షించారు. పంగులూరు ఎంఎస్‌ఆర్ అండ్ బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలోని ఎస్‌ఆర్‌ఆర్ అకాడమీలో ఢిల్లీ కేంద్రంగా నిర్వహించబోతున్న ప్రపంచ కప్ ఖోఖో పోటీల లోగోను సోమవారం డాక్టర్ గరటయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గరటయ్య మాట్లాడుతూ పంగులూరులో ఖోఖో క్రీడకు ఎంతో ప్రాచూర్యం ఉందన్నారు. మూడున్నర దశాబ్దాలుగా పంగులూరు కేంద్రంగా ఖోఖో క్రీడకు లభించిన ఆదరణ, స్థానికంగా రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాలను గరటయ్య గుర్తు చేశారు. ఖోఖో అన్ని క్రీడలకు తల్లి వంటిదని కొనియాడారు. ఖోఖో క్రీడాకారులను తీర్చి దిద్దడంలో పంగులూరు ఓ ఖార్ఖానాగా పేరు గడించిదన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించగా, పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొని పతకాలను సాధించారని రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి గుర్తు చేశారు. క్రీడల్లో రాణించిన ఎందరికో ఉపాధి చూపిన ఖోఖో కనిగిరి, ఈదర ప్రాంతాలలో విస్తరించేందుకు దోహద పడిందన్నారు. ప్రపంచ ఖోఖో పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం తమ సొంతగడ్డపై పోటీలను నిర్వహిస్తున్న అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఖోఖో లోగోతో పలువురు క్రీడాకారులు, పాఠశాల విద్యార్థులు గ్రామ పుర వీధులలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, కోచ్ డీఎల్ రెడ్డి, రోటరీ ప్రతినిఽధులు విశ్రాంత ఫ్రొఫెసర్ బత్తుల వీరనారాయణ, చిలుకూరి వీరరాఘవయ్య, హెచ్‌ఎం రమాదేవి, నేతలు జార్లమూడి సుబ్బారావు, రావూరి శ్రీనివాసరావు, ఐ.సుబ్బారావు, పలువురు సీనియర్ ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు.