బండలాగుడు పోటీల్లో రాచర్ల ఎడ్లకు ప్రథమ స్థానం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:34 PM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిన్నకంభంలో వెలసిన శ్రీవీరభద్రస్వామి తిరునాళ్లకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రెండుపళ్ల ఎడ్ల బండలాగుడు పోటీలో రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మీనాయుడుకు చెందిన ఎడ్ల జత 3,149 అడుగుల దూరం బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ. 30వేల నగదు గెలుపొందినట్లు నిర్వాహకుడు శరభారెడ్డి తెలిపారు.

కంభం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిన్నకంభంలో వెలసిన శ్రీవీరభద్రస్వామి తిరునాళ్లకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రెండుపళ్ల ఎడ్ల బండలాగుడు పోటీలో రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మీనాయుడుకు చెందిన ఎడ్ల జత 3,149 అడుగుల దూరం బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ. 30వేల నగదు గెలుపొందినట్లు నిర్వాహకుడు శరభారెడ్డి తెలిపారు. ఈ బండలాగుడు పోటీల్లో మొత్తం 15 జతల ఎడ్లు పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా గడివేముల గ్రామానికి చెందిన సంజయ్‌కుమార్ ఎడ్ల జత 3,110 అడుగుల దూరం బండను లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 25వేలు, రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన విజయలక్ష్మినాయుడు రెండో ఎడ్ల జత 2,700 అడుగుల దూరం బండను లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ. 20వేలు, బేస్తవారపేట మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన వెలిగండ్ల వెంకటచైతన్యకి చెందిన ఎడ్ల జత 2,495 అడుగుల దూరం బండను లాగి నాల్గవ స్థానంలో నిలిచి రూ. 15వేలు, రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన కె.రంగారెడ్డి ఎడ్ల జత 2,221 అడుగుల దూరం బండను లాగి ఐదవ స్థానంలో నిలిచి రూ. 10వేలు, మార్కాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం.జకరయ్యకు చెందిన ఎడ్ల జత 1,933 అడుగుల దూరం బండను లాగి 6వ స్థానంలో నిలిచి రూ. 8వేలు, రాచర్ల మండలం ఆరవీటికోట గ్రామానికి చెందిన రాజరంగారెడ్డికి చెందిన ఎడ్ల జత 1,880 అడుగుల దూరం బండను లాగి 7వ స్థానంలో నిలిచి రూ. 5వేలు, కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన హరికృష్ణయాదవ్ ఎడ్ల జత 1,791 అడుగుల దూరం బండను లాగి 8వ స్థానంలో నిలిచి రూ. 3వేలు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.