ఇసుక దందా, అనధికారిక లేఅవుట్లను ఉపేక్షిస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:55 PM
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అనధికారిక లేఅవుట్లపై ఉపేక్షిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లకు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరం ప్రాంగణంలో సోమవారం వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అనధికారిక లేఅవుట్లు, ఇసుక దందాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లదేనన్నారు.

ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు
చీరాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అనధికారిక లేఅవుట్లపై ఉపేక్షిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లకు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరం ప్రాంగణంలో సోమవారం వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అనధికారిక లేఅవుట్లు, ఇసుక దందాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లదేనన్నారు. ఒకవేళ మీ విధులకు ఎవరన్నా ఆటంకం కలిగిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎవరైనా తమ పరిధిలో జరుగుతున్న ఈ దందాలను అరికట్టకుండా, ఉన్నతాధికారులకు తెలుపకుండా వ్యవహరిస్తే అది ఉద్దేశపూర్వక తప్పుగా భావించి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రభుత్వ భూములు, స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వ ఆస్తి ఎక్కడా పరాధీనం కాకూడదన్నారు. వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లకు క్షేత్ర స్థాయిలో ఎమన్నా ఇబ్బందులు ఎదురువుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ అర్జున్, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.