ఐడీఎ్‌సఎంటీ స్థలాల వేలానికి చర్యలు వేగవంతం
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:38 PM
నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఐడీఎ్‌సఎంటీ స్థలాలలో మిగిలిన ప్లాట్‌లు వేలం వేసేందుకు అవసరమైన చర్యలను కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. గత కొన్నేళ్లుగా పిచ్చిమొక్కలు, ఆక్రమణలతో నిండిన ఆ స్థలాలను బాగు చేసే పనులు వేగంతం చేశారు. ప్లాట్‌లోని చెరువుల్లోని నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయడంతోపాటు, ప్లాట్‌లను చదును చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు.

ఒంగోలు, కార్పొరేషన్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఐడీఎ్‌సఎంటీ స్థలాలలో మిగిలిన ప్లాట్‌లు వేలం వేసేందుకు అవసరమైన చర్యలను కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. గత కొన్నేళ్లుగా పిచ్చిమొక్కలు, ఆక్రమణలతో నిండిన ఆ స్థలాలను బాగు చేసే పనులు వేగంతం చేశారు. ప్లాట్‌లోని చెరువుల్లోని నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయడంతోపాటు, ప్లాట్‌లను చదును చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నగర కమిషనరు డాక్టర్ కే. వెంకటేశ్వరరావు పనులు పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొప్పోలు రోడ్‌లోని ఇందిరమ్మ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ తదిరత ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు పనులను పరిశీలించారు. అలాగే ఆక్రమణల తొలగింపులో ఆర్‌అండ్‌బీ అధికారులు మార్కింగ్ చేయగా, రెవెన్యూ అధికారులు పట్టాల పరిశీలన చేశారు. ఈ సమయంలో స్థానికులు కొందరు ఆక్రమణల తొలగింపు పనులను అడ్డుకున్నారు. తమ నివాసాలు కూల్చొద్దని కొద్దిసేపు నిరసన తెలియజేయగా, అభివృద్ధిలో భాగంగానే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు కమిషనరు వారికి వివరించారు. ఇదిలా ఉండగా రాజీవ్ నగర్‌లో పర్యటించిన కమిషనరు ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లను పరిశీలించారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు సెట్‌బ్యాక్‌లు వదలాలని, అలాగే ప్లాన్ ప్రకారం కట్టుకోవాలని సూచించారు.