1న గృహప్రవేశాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:56 AM
జిల్లాలో ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన సామూహిక పక్కా గృహాల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతి నిధులు, పక్కాగృహాల లబ్ధిదారులను భాగస్వాములను చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టారు.

2,944 మంది లబ్ధిదారుల చేతికి ఇళ్ల తాళాలు
ఒంగోలు నగరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన సామూహిక పక్కా గృహాల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతి నిధులు, పక్కాగృహాల లబ్ధిదారులను భాగస్వాములను చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వం మంజూరుచేసిన పక్కా గృహాల్లో 2,944 నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఒకటో తేదీన ప్రారంభించి లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్నారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం గత నెలలోనే నిర్వహించాలని చూసింది. అనివార్య కారణాలతో వాయిదా వేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీన జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో అత్యధికంగా 677, అత్యల్పంగా కొండపి నియోజకవర్గంలో 141 ఇళ్లల్లో ప్రవేశాలను నిర్వహించనున్నారు.