Share News

ఘనంగా ఎన్‌టీఆర్‌ వర్ధంతి

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:50 AM

పేద ప్రజల హృదయాలలో నిరంతరంగా నిలిచే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

ఘనంగా ఎన్‌టీఆర్‌ వర్ధంతి

గిద్దలూరుటౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల హృదయాలలో నిరంతరంగా నిలిచే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం ఎన్‌టీఆర్‌ 29వ వర్ధంతి కార్యక్రమాలను పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో ఘనంగా నిర్వ హించారు. ముందుగా ఎన్‌టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కూటమి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన సామాజిక ఉద్యమ నిర్మాత నందమూరి తారక రామారావు అన్నారు. సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీ పరులైన నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్‌టీఆర్‌కే దక్కుతుందన్నారు. నటనలోనూ, రాజకీయం లోనూ తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందార న్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబా, బీజేపీ నాయకులు డాక్టర్‌ జేవీ.నారాయణ, పిడతల రమేష్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు షానేషావలి, కౌన్సిలర్లు లొక్కురమేష్‌, గడ్డం భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్‌, బిల్లా రమేష్‌, ఎంపీటీసీ సభ్యుడు గర్రె శ్రీనాథ్‌, టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, మహిళ నాయకురాలు కె.లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

206 మంది రక్తదానం

ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా 206 మంది రక్తదానం చేశారు. మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అభినందించారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు అయ్యారని కొనియాడారు.

కంభం : ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ నాయకులు, టీడీపీ ఎన్‌టిఆర్‌ ప్రచార సభ్యులు సయ్యద్‌ రఫి ఆధ్వర్యంలో మండలంలోని ఎల్‌కోట గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్‌ఆర్‌ఐ రఫి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చార న్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు నూరుల్లాఖాద్రి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఖాదర్‌ హుస్సేన్‌, చమన్‌, సాధిక్‌, అన్వర్‌, ఇర్ఫాన్‌, ముస్లిం మైనారిటీ సెల్‌ కార్యదర్శి అత్తర్‌ షేక్‌ హుస్సేన్‌, రావిపాడు మాజీ సర్పంచ్‌ కోటయ్య పాల్గొన్నారు.

బేస్తవారపేట : బేస్తవారపేటలోని బస్టాండ్‌ కూడలిలో టీడీపీ మండల అఽధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డి.సైదులు, ప్రధాన కార్యదర్శి నరసింహా, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మూప్పూరి రాము, బి.సుబ్బరత్నం, సత్యేలి కృష్ణ యాదవ్‌, బుద్దుల ప్రేమానంద్‌, సుబ్రహ్మణ్యం, దూదెకుల ఆదాం, చిన్న ఓబినేనిపల్లె సర్పంచ్‌ బి.శ్రీనిశ్వర్‌రెడ్డి, దూదెకుల హుస్సేన్‌, బి.అరుణ్‌ కుమార్‌, సందు రమేష్‌, అనిత, నాగూర్‌, బి.శంకర్‌, ఆకుల శ్రీను, దూదెకుల శివ, తదితరులు పాల్గొన్నారు,.

మార్కాపురం : పట్టణంలోని దోర్నాల బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారన్నారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుంటక సుబ్బారెడ్డి, నాయకులు షేక్‌ షెక్షావలి, తాళ్లపల్లి సత్యనారాయణ, షేక్‌ మౌలాలి, రమణ, మయూరి ఖాశిం, దగ్గుల శ్రీనివాసరెడ్డి, గాయం వెంకటనారాయణరెడ్డి, మాలపాటి వెంకటరెడ్డి, పఠాన్‌ హుసేన్‌ఖాన్‌, గులాబ్‌, నాగెళ్ల వెంకటేశ్వర్లు, గుంటక వెంకటేశ్వరరెడ్డి, షాకీర్‌, గోగిరెడ్డి సత్యనారాయణరెడ్డి, బత్తుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా స్థానిక సర్వజన వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు కందుల రామిరెడ్డి ఆద్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్‌ మౌలాలి, వక్కలగడ్డ మల్లికార్జున, మాలపాటి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడు : తర్లుపాడు బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్థంతి వేడుకలు నిర్వహించి రోగులకు పాలు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమం లో మండల టీడీపీ అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ రావి బాసపతిరెడ్డి, టీడీపీ నాయకులు కాళంగి శ్రీనివాసులు, ఈర్ల వెంకటయ్య, జి.సుబ్బయ్య, ఎన్‌.లక్ష్మయ్య, కాశీంవలి(బొంబాయి), పలువురు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.

పొదిలి : టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి కార్యక్రమా లను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పెద్దబస్టాండ్‌, చిన్నబస్టాండ్‌ కూడళ్లలోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పెద్దదోర్నాల : స్థానిక నటరాజ్‌ కూడలిలో దివంగత ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, చంటి, ఈదర మల్లయ్య, కే సుబ్బారెడ్డి,షేక్‌ భాష, నాగెళ్ల సత్యనారాయణ, షేక్‌ మౌలాలి, షేక్‌ రఫీ, జీ.వెంగళ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని మండలంలోని అన్ని గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొత్త అన్నసముద్రం, చెర్లోపల్లి, మిట్టపాలెం గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పాతముడివేముల, ఒడ్డుపాలెం, త్రిపురాంతకంలో ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వాటర్‌ డిస్ర్టిబ్యూటర్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ పి.గురవారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు వి.అంకారావు, ఊట్ల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరెడ్డి, పి.నాసరరెడ్డి, రాయుడు, కోటయ్య, జనసేన మండల అధ్యక్షుడు మల్లిఖార్జున, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : ప్రపంచానికి తెలుగోడి సత్తా చాటిచెప్పిన ఒకే ఒక్క నాయకుడు నందమూరి తారకరామారావు అని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాచర్ల - మార్కాపురం జాతీయ రహదారిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులతో కలసి పూలమాల వేసి నివాళలు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో, దేశంలో ఒక మైలురాయిగా నిలిపారన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన మరణాంతరం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీని అంచెలంచెలుగా ప్రజల్లోకి తీసుకు పోయారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఆందేలా ముందుకు నడుస్తున్నారని అన్నారు.

మెగా రక్తదాన శిబిరం

స్థానిక పార్టీ కార్యలయంలో ఇన్‌చార్జీ గూడూరి ఎరిక్షన్‌ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిం చారు. ఈ రక్తదాన శిబిరానికి నియోజకవర్గం నుంచి నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో టీడీపీ మండల ఆధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పట్టణ ఆధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలీ(మ్యాక్స్‌) నాయకులు వేగినాటి శ్రీను, కొత్తమాసు ఆనంత వెంకట సుబ్రహ్మణ్యం, తోట మహేష్‌నాయుడు, కామేపల్లి వెంకటేశ్వర్లు, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, పెరుమాళ్ల మల్లికార్జునరావు, చెవుల ఆంజయ్య, శ్రీశైలపతి నాయుడు, రవణమ్మ ముతులూరి మల్లికార్జున చారి, గజ్జా వెంకటేశ్వర్లుతో పాటు ఐదు మండలాల నాయకులు, అభిమానులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 01:50 AM