ఆధ్యాత్మిక చింతనతో అందరికీ ఆనందం
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:25 PM
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడే ఆనందంగా జీవిస్తారని ఎమ్మెల్యే ఎంఎం కొం డయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పిట్టువారిపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, వేటపాలెం మండల పరిధిలోని జాతీయ రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శ్రీశ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో పల్నాటి అంకమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాలటౌన్, ఫిబ్రవరి2 (ఆంధ్రజ్యోతి) : ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడే ఆనందంగా జీవిస్తారని ఎమ్మెల్యే ఎంఎం కొం డయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పిట్టువారిపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, వేటపాలెం మండల పరిధిలోని జాతీయ రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శ్రీశ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో పల్నాటి అంకమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈక్రమంలో ఆయా దేవస్థానాల కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతంపలికారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.