Share News

వినియోగంలోకి గుంటుపల్లి ఎత్తిపోతల

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:46 PM

గత రెండేళ్ల నుంచి మరమ్మతులకు గురై ఉన్న గుంటుపల్లి ఎత్తిపోతల పథ కం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక కృషితో ఎట్టకేలకు బుధవారం నుంచి వినియెగంలోకి వచ్చింది. రెండేళ్లగా నిరుపయెగంగా ఎత్తిపోతల పథకం ఉండడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. దీంతో ఇటీవల నీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన డీసీ వైస్‌ చైర్మన్‌ కోయ పేరయ్యను ఎత్తిపోతల పథకాన్ని వినియెగంలోకి తీసుకురావాలని రైతులు కోరారు.

వినియోగంలోకి గుంటుపల్లి ఎత్తిపోతల
మరమమ్మతులు అనంతరం వినియోగంలోకి వచ్చిన గుంటుపల్లి ఎత్తిపోతల పథకం

మంత్రి రవికుమార్‌ ఆదేశాలతో

చోరీ అయిన ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో కొత్తది ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న మూడు గ్రామాల రైతులు

బల్లికురవ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : గత రెండేళ్ల నుంచి మరమ్మతులకు గురై ఉన్న గుంటుపల్లి ఎత్తిపోతల పథ కం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక కృషితో ఎట్టకేలకు బుధవారం నుంచి వినియెగంలోకి వచ్చింది. రెండేళ్లగా నిరుపయెగంగా ఎత్తిపోతల పథకం ఉండడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. దీంతో ఇటీవల నీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన డీసీ వైస్‌ చైర్మన్‌ కోయ పేరయ్యను ఎత్తిపోతల పథకాన్ని వినియెగంలోకి తీసుకురావాలని రైతులు కోరారు. దీంతో అయన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించగా అందులో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ అయి ఉంది. మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయాన్ని పేరయ్య మంత్రి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. పథకంలో మరమ్మతులు చేసి నీటిని పంటలకు విడుదల చేస్తున్నారు. ఎంతో కాలంగా పనిచేయని ఎత్తి పోతల పథకం కూటమి ప్రభుత్వం రాగానే వినియెగంలోకి తీసుకు రావడం పట్ల రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా గుంటుపల్లి, కొత్తపాలెం, బల్లికురవ గ్రామాలలో ఉన్న 12 వందల ఎకరాల భూములను నీరు అందుతుందని మొక్కజొన్నను రైతులు సాగు చేసి ఉన్నారని ఇప్పుడు పథకం వినియెగంలోకి రావడం పంటలకు ఉపయోగమనిరైతులు అం టున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:46 PM