Share News

గుండ్లకమ్మ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:43 PM

ఇసుక తవ్వకాల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదు... అదే సమయంలో ఇసుకను ప్రజలకు అందకుండా అడ్డంకులు సృష్టిం చి ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తే అసలు ఒప్పుకునేది లేదని.. గుండ్లకమ్మ బ్రిడ్జి, ఊటబావుల వద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా... ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలలో మా త్రమే ఇసుక తవ్వకాలు జరిగేల ని, పగలు సమయంలో మా త్రమే ఇసుక తరలించే విధంగా చర్యలు చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇటీవల అద్దంకి లో జరిగిన రెవెన్యూ సదస్సు లో ఆయా శాఖల అధికారులకు విద్యుత్‌శాఖ మం త్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

గుండ్లకమ్మ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
గుండ్లకమ్మలో బ్రిడ్జి వద్ద జరిగిన ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గోతులు

మంత్రి ఆదేశించినా కఠిన చర్యలపై అధికారుల ఉదాసీనత

ఆక్రమణదారుల వసూళ్లు

ప్రజలకు తప్పని ఇసుక భారం

అద్దంకి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఇసుక తవ్వకాల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదు... అదే సమయంలో ఇసుకను ప్రజలకు అందకుండా అడ్డంకులు సృష్టిం చి ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తే అసలు ఒప్పుకునేది లేదని.. గుండ్లకమ్మ బ్రిడ్జి, ఊటబావుల వద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా... ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలలో మా త్రమే ఇసుక తవ్వకాలు జరిగేల ని, పగలు సమయంలో మా త్రమే ఇసుక తరలించే విధంగా చర్యలు చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇటీవల అద్దంకి లో జరిగిన రెవెన్యూ సదస్సు లో ఆయా శాఖల అధికారులకు విద్యుత్‌శాఖ మం త్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. అయితే అప్పుడు ఒకింత హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత మరలా షరా మాములు గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో బ్రిడ్జి వద్ద మరలా గత నాలుగైదు రోజులుగా ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఉదాసీనత వల్లనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

ప్రజలకు ఇసుక కష్టాలు

గుండ్లకమ్మ నదిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు అదే భూమిలో ఇసుక ను అ మ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆ భారం ప్రజలపై పడుతుంది. గుండ్ల కమ్మ నది ని ఆ క్రమించి ఇటీవల వరకు పంటలు సాగు చేశా రు. వరద వచ్చిన సమయంలో మునిగిపోవడం, మిగిలిన సమయంలో పశు గ్రాసం, వరి సాగు జరిగేది. అయితే అదే ఆ క్రమిత భూమి ని ఇప్పుడు ఆ క్రమణదారులు ఇసుక అమ్మకాలు చేస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. ఎకరా 5 నుంచి 10 లక్షల రూపాయల కు అమ్ముకుంటున్నా రు. లేదా ఒక్కో ట్రాక్టర్‌ కు 700 నుండి వెయ్యి రూపాయలు చొప్పున వసూ లు చేస్తున్నారు. దీం తో ట్రాక్టర్‌ ఇసుక అద్దంకి పట్టణం కు చేరేందుకు 2200 రూ పాయలు గా ఉంది. ప్రభుత్వ భూమిగా ఉన్న గుండ్లకమ్మ నదిలో ఇసు కకు ఆ క్రమణదారులు డబ్బులు వసూలు చేయ డం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇసుకకు డబ్బులు చెల్లింపు లేకపోతే 1500 రూపాయలకే అద్దంకి పట్టణంలోకి ఇసుక చేరుతుంది. ఇప్పటికైనా గుండ్లకమ్మ నది సర్వే చేపట్టి హద్దులు నిర్ధారించినందున ఆయా ప్రాంతాలలో ఇసుక కు ఎ లాంటి డబ్బులు చెల్లించకుండా అధికారులు చర్య లు చేపడితే తక్కువ కే ఇసుక లభ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభి ప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి గుండ్లకమ్మ బ్రిడ్జి, ఊటబావుల వద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు చేపట్టడం తో పాటు ఇసుక తవ్వకాలకు ఆ క్రమణదారులు డబ్బులు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:43 PM