Share News

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:11 PM

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు.

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
మాట్లాడుతున్న డాక్టర్‌ లక్ష్మీ, వేదికపై రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, పాపారావు, సాగర్‌

దర్శి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో శుక్రవారం నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగాల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, లూయి్‌సబ్రెయిలీ, హెలన్‌కెల్లర్‌ తదితర ఉద్దండులైన వ్యక్తులు విభిన్న ప్రతిభావంతులే అన్న విషయాన్ని గుర్తించి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.6వేలు, పూర్తి అంగవైకల్యం కల్గిన వారికి రూ.15వేలు చొప్పున పింఛన్లు ఇస్తోందన్నారు. అవసరమైన పరికరాలు అందిస్తామని చెప్పారు.

అమలవుతున్న హామీలు కనిపించడం లేదా...

హామీల అమల్లో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని కొంతమంది వైసీపీ నాయకులు విమర్శించటం విడ్డూరంగా ఉందని లక్ష్మి విమర్శించారు. తొలి ఆరు నెలల కాలంలో అనేక హమీలు నెరవేర్చిన విషయం వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గుర్తించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్ధ చైర్మెన్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి దోచుకున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతామోనన్న భయంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, జిల్లా విభిన్న ప్రతిభావంతుల ఏడీ అర్చన, ఎంపీడీవో కృష్ణమూర్తి, దర్శి నగర పంచాయతీ కమీషనర్‌ వై మహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:11 PM