Share News

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:17 AM

పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పశు వైద్యశాఖ అధికారి వేణుగోపాల్‌ అన్నారు. గురువారం మండలంలోని నాగులపాలెంలో పశు సంవర్థక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధికారి ప్రారంభించారు.

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పశు పోషకులకు మందులను పంపిణీ చేస్తున్న అధికారులు

జిల్లా పశు వైద్యాధికారి వేణుగోపాల్‌

నాగులపాలెం(పర్చూరు), జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పశు వైద్యశాఖ అధికారి వేణుగోపాల్‌ అన్నారు. గురువారం మండలంలోని నాగులపాలెంలో పశు సంవర్థక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధికారి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీహెచ్‌వో మాట్లాడుతూ పశువులకు మెరుగైన వైద్య సేవలను అందించడంతోపాటు, పశుపోషకులను పోత్సహించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మం డల ప్రత్యేక అధికారి పి.షానిలా ఏడీ మాధవి, సీహెచ్‌ చంద్రశేఖర్‌, వైద్యులు అరుణ, భాగ్యరాజ్‌, సిబ్బంది, పోషకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 12:17 AM