హమాలీలకు పెంచిన కూలి ఇవ్వకుంటే సమ్మెకు సిద్ధం
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:16 AM
సివిల్ సప్లయీస్ హమాలీలకు గత ఏ డాది జనవరి నుంచి పెంచిన కూలిరేట్లతో పా టు అరియర్స్ చెల్లించకపోతే సమ్మె చేపట్టేం దుకు సిద్ధంగా ఉన్నట్లు సీఐటీయూ జిల్లా అ ధ్యక్షుడు కాలం సుబ్బారావు హెచ్చరించారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యో తి) : సివిల్ సప్లయీస్ హమాలీలకు గత ఏ డాది జనవరి నుంచి పెంచిన కూలిరేట్లతో పా టు అరియర్స్ చెల్లించకపోతే సమ్మె చేపట్టేం దుకు సిద్ధంగా ఉన్నట్లు సీఐటీయూ జిల్లా అ ధ్యక్షుడు కాలం సుబ్బారావు హెచ్చరించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏపీ పౌరసరఫరాల సంస్థ హమాలీల యూని యన్ సమావేశం జిల్లా అధ్యక్షుడు బిందె ఆం జనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా సుబ్బారావు మాట్లాడుతూ పెంచిన మూ డు రూపాయాల వేతనాన్ని కూడా ఇప్పటి వర కు చెల్లించకపోవడం దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వానికి హమాలీల పట్ల చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. ప్రతినెలా సరుకుల రవాణా మీద పెట్టే శ్ర ద్ధను, ఆ సరుకులు తోలే కూలీల పట్ల చూపడం లే దన్నారు. గత ఏడాది జ నవరిలో కూలి రేట్లు పెం చినా ఇంతవరకు అమలు చేయకపోవడం తగదని, 14 నెలల నుంచి అరియ ర్స్‌కు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్ర భుత్వం స్పందించి వెంట నే కూలి రేట్లు, అరియర్స్‌ను చెల్లించాలని కో రారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ద శల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్న ట్లు తెలిపారు. ఈనెల 24,25 తేదీల్లో తహ సీల్దార్లకు వినతిపత్రాలు, మార్చి 3న మండల కేంద్రాల్లో ధర్నాలు, అప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి 27న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకు లు బత్తుల గోపాలరావు, పి.కోటేశ్వరరావు, సు బ్బారావు, నాగిరెడ్డి, రంగయ్య, శ్రీను, మల్లికార్జు న బాబు, ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.