ఉచితంగా గుండెపోటు నివారణ ఇంజక్షన్
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:49 PM
ప్రభుత్వం వైద్యశాలలో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వేల రూపాయలు విలువ చేసే గుండె పోటు నివారణ ఇంజక్షన్‌ను ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అందిస్తుందని దానిని రోగులు సద్వినియోగపర్చుకోవాలని సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ డి.శరత్‌కుమార్ అన్నారు. బుధవారం అద్దంకి సీహెచ్‌సీలో గుండెపోటు నివారణ ఇంజక్షన్‌కు సంబంధించి స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండెపోటు వచ్చే లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శరత్‌కుమార్ వివరించారు.
అద్దంకిటౌన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం వైద్యశాలలో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వేల రూపాయలు విలువ చేసే గుండె పోటు నివారణ ఇంజక్షన్‌ను ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అందిస్తుందని దానిని రోగులు సద్వినియోగపర్చుకోవాలని సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ డి.శరత్‌కుమార్ అన్నారు. బుధవారం అద్దంకి సీహెచ్‌సీలో గుండెపోటు నివారణ ఇంజక్షన్‌కు సంబంధించి స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండెపోటు వచ్చే లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శరత్‌కుమార్ వివరించారు. ఛాతీనొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. మొదటి గంట అత్యంత కీలకమని, ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని 108 అంబులెన్స్ సాయంతో మొదటి గంటలోపు దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు తిసుకురావడం, ప్రథమిక పరీక్షల అనంతరం రూ.45వేల విలువైన ఈ ఇంజక్షన్‌ను రోగికి అందించి ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిత జ్యోతి, డాక్టర్ డి.ప్రదీప్తి, డాక్టర్ జి.మెర్సీ, పీజీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.