విద్యార్థుల భవితవ్యంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:22 PM
నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల భవితవ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం వేటపాలెం మండల పరిధిలోని అక్కయ్యపా లెం ఎంపీయూపీ స్కూల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా స్కూల్‌ను మోడల్‌గా మార్చేందుకు సంబంఽధిత ఇం జనీరింగ్ అఽధికారులతో నివేదికను సిద్ధం చేయించాలని సూచించారు.

ఎమ్మెల్యే కొండయ్య
చీరాలటౌన్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల భవితవ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం వేటపాలెం మండల పరిధిలోని అక్కయ్యపా లెం ఎంపీయూపీ స్కూల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా స్కూల్‌ను మోడల్‌గా మార్చేందుకు సంబంఽధిత ఇం జనీరింగ్ అఽధికారులతో నివేదికను సిద్ధం చేయించాలని సూచించారు. అనంతరం కొండయ్య విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభు త్వ పథకాలను వినియోగించుకొని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నోట్ పు స్తకాలను పంపిణీ చేశారు. అలాగే చల్లారెడ్డి పాలెంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం సందర్భగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వాడరేవు గ్రామం లో నిరుపయోగంగా ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్‌ను పరిశీలించారు. అఽధికారులకు సూచనలు చేశారు. అంతేకాకుండా వాడరేవుకు చెందిన మత్య్సకారుడు ఎరిపిల్లి రమణ(53) వేటకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఆకుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనవెంట పలువురు నాయకులు ఉన్నారు. అంతకముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయంలో రూ.13లక్షల 20వేల సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.