పెండింగ్ కేసులపై దృష్టిసారించాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:54 PM
నిర్ధిష్టమైన ప్రణాళికతో పెండింగ్ కేసులు దర్యాప్తు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్‌లో నెలవారీ వార్షిక సమావేశం జరిగింది.

నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ
ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచిన వారికి అభినందన
6 డ్రోన్ కెమెరాలు అందజేత
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి) : నిర్ధిష్టమైన ప్రణాళికతో పెండింగ్ కేసులు దర్యాప్తు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్‌లో నెలవారీ వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పాత కేసులను సమీక్షించి పలు సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, గుర్తు తెలియని మృతి కేసులపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అదే విధంగా పల్లామల్లి ఫైరింగ్ రేంజిలో గురువారం ఉదయం జరిగిన ఫైరింగ్ ప్రాక్టీ్‌సలో ఆత్యంత ప్రతిభ కనబరిచిన ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, దర్శి ఎస్సై మురళి, పామూరు సీఐ భీమానాయక్‌లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆరు డ్రోన్ కెమెరాలు అందజేత
జిల్లాలోని కనిగిరి, వెలిగండ్ల, ముండ్లమూరు, పామూరు ,గిద్దలూరు, కొండపి పోలీసుస్టేషన్లకు దాతలు డ్రోన్ కెమెరాలను ఎస్పీకి అందజేశారు. వారిని ఎస్పీ అభినందించారు.