Share News

వంగ ధరలు పతనం

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:29 PM

వంగ ధరలు ఒక్క సారిగా ఢమాల్‌ మన్నాయి. గత నెలలో పది కేజీలు రూ.400 పలికిన వంకాయలు ఇప్పుడు పది కేజీలు రూ.50 పలుకుతున్నాయి. దీం తో రైతులు అమ్మకాలకు తీసుకువెళితే కోత కూలి కూడా రావఛిం లేదని రైతులు లబోదిబో మంటున్నారు. కొందరు రైతులు ముం దు ముందు ధర వస్తుందన్న ఆశతో ముదిరి పోయిన వంకాయలను కోసి రోడ్ల వెంబడి పారబోస్తున్నారు.

వంగ ధరలు పతనం
వైదనలో సాగులో ఉన్న వంగ తోట

ధర లేక ముదిరిన వంకాయలను కోసి

రోడ్డు పక్కన పడేసిన రైతులు

గత నెలలో 10కేజీల వంకాయలు

రూ.400, నేడు పది కేజీలు రూ.50

లబోదిబోమంటున్న రైతులు

ముదిరిన కాయలను కోసి పారబోస్తున్న రైతులు

బల్లికురవ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : వంగ ధరలు ఒక్క సారిగా ఢమాల్‌ మన్నాయి. గత నెలలో పది కేజీలు రూ.400 పలికిన వంకాయలు ఇప్పుడు పది కేజీలు రూ.50 పలుకుతున్నాయి. దీం తో రైతులు అమ్మకాలకు తీసుకువెళితే కోత కూలి కూడా రావఛిం లేదని రైతులు లబోదిబో మంటున్నారు. కొందరు రైతులు ముం దు ముందు ధర వస్తుందన్న ఆశతో ముదిరి పోయిన వంకాయలను కోసి రోడ్ల వెంబడి పారబోస్తున్నారు. నెలరోజుల వ్యత్యాసంలోనే ధరలు ఇలా తగ్గడంతో వంగ సాగు చేసిన రైతులు దిగాలుగా ఉన్నారు.

బల్లికురవ మండలంలోని వైదన, కొప్పెరపాడు, ఎస్‌ఎల్‌గుడిపాడు, కొణిదెన, అంబడిపూడి, కొత్తపాలెం, గుంటుపల్లి, గంగపాలెం, కొప్పెరపాలెం తదితర గ్రామాలలో రైతులు బోరు బావుల నీటి ద్వారా వంకాయలను సాగు చేశారు. మెదట్లో వంకాయల ధరలు అకాశాన ఉండడంతో గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ధర ఉంటుందని రైతులు ఎంతో ఆశ పడ్డారు. గత నెల మెదట్లో పది కేజీల వంకాయులు నాలుగు వందల నుంచి అయిదు వందల వరకు అమ్మకా లు జరిగాయి. ఈ నెల మెదటి నుంచే పది కేజీల వంకాయల ధర రూ.50 పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో గత నెలలో కేజీ రూ.60 పలకగా ఇప్పుడు రూ.15కి అమ్మకాలు జరుగుతున్నాయి. రైతులకు కోత కూలి బాడుగ కూడా చేతికి రావడం లేదని రైతులు తెలిపారు. వైదన గ్రామంలో వంగ సాగు చేసిన రైతులు కొందరు ధర లేక కొద్దిరోజులకు ధర వస్తుందని ఎదురుచూసి చివరకు వంకాయలు ముదిరిపోవడంతో వాటిని కోసి అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పక్కన పారబోస్తున్నారు. కొందరు రైతులు హైదరాబాద్‌ మార్కెట్‌కు వంకాయలను తీసుకు వెళుతున్నారు. అక్కడ పది కేజీలు రూ.150 వరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. అక్కడకు వెళ్లిన రైతులకు బాడుగ పోను చేతికి ఒక్క రుపాయి కూడా మిగలడం లేదని కొందరు అంటున్నారు. ఎప్పుడు కూరగాయల ధరలు భగ్గు మంటాయో ఎప్పుడు దిగజారుతాయో అర్థం కాని పరిస్థితిలో తాము ఉన్నామని రైతులు అంటున్నారు. నిలకడ లేని ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. గత పది రోజుల నుంచి అనిన రకాల కూరగాయల ధరలు తగ్గుముఖంలో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:29 PM