Share News

హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ ఖైదు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:48 PM

హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఒంగోలు థర్డ్‌క్లాస్‌ ఏడీజే కోర్టు జీవితఖైదు, జరిమానా విధించినట్లు ఎస్‌ఐ టి. కిశోర్‌బాబు తెలిపారు.

హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ ఖైదు

నిందితులు అంతా ఒకే కుటుంబం

ఒంగోలు క్రైం/పామూరు, మార్చి5(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఒంగోలు థర్డ్‌క్లాస్‌ ఏడీజే కోర్టు జీవితఖైదు, జరిమానా విధించినట్లు ఎస్‌ఐ టి. కిశోర్‌బాబు తెలిపారు. పామూరుకు చెందిన షేక్‌ ఖాశింపీరా (63)అనే వ్యక్తి తన కుమారుడు షేక్‌ మహబూబ్‌బాషతో కలిసి టెంట్‌హౌస్‌ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆయన తమ్ముడు జిలాని అదే గ్రామానికి చెందిన మజున్స నయాభా అలియాస్‌ సున్నా అనే వ్యక్తిని బేల్దారి పనుల నిమిత్తం నిర్మల్‌ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు పనిచేసి తర్వాత మేస్ర్తికి తెలియకుండా స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయంపై జిలాని నయాబాను ప్రశ్నించగా వారిమధ్య ఘర్షణ జరిగింది. దీనిపై ఖాశింపీరా నయాభాను మందలించాడు. దీన్ని మనసులో పెట్టుకొన్న నయాభా 2017 జనవరి 15న రాత్రి 8గంటల సమయంలో టెంట్‌హో్‌సను క్లోజ్‌చేసి ఇంటికి వెళుతున్న ఖాశింపీరా, ఆయన కుమారుడిపై నయాభా, రసూల్‌, బాబు, ఖాజా, మస్తాన్‌సాహేబ్‌లు కత్తితో, క్రికెట్‌బ్యాట్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో ఖాశింపీరా మృతిచెందాడు. ఈఘటనపై పామూరు పోలీ్‌సస్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ సాంబశివరావు కేసు నమోదు చేయగా సీఐ ఎం రాజే్‌షకుమార్‌ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో వారిపై అభియోగపత్రం దాఖలు చేశారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై. ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్‌ తరుపున వాదించారు. నిందితులపై సాక్షాధారాలతో నేరనిరూపణ చేయడంతో ఒంగోలు మూడవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయాధికారి డి రాములు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొరికి రూ.7,500 లు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.

Updated Date - Mar 05 , 2025 | 11:48 PM