Share News

మహిళా జోష్‌..

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:47 PM

వారందరూ హోదాలు మరిచారు.. పాదాలు కదిపారు.. ఆటలాడారు.. చప్పట్లు కొట్టారు.. కేరింతలు వేశారు.. చిన్నపిల్లల మాదిరి పోటీపడ్డారు. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. ఒంగోలు నగరంలోని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ భవనం ఆవరణలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలతో అక్కడ సందడి నెలకొంది.

మహిళా జోష్‌..
లెమన్‌ స్పూన్‌ ఆటలో పోటీ పడుతున్న ఉద్యోగినులు

ఉత్సాహంగా ఉద్యోగినులకు ఆటల పోటీలు

పోటీలను ప్రారంభించిన ఆయూ్‌షశాఖ ఆర్‌డీ పద్మజ

వారందరూ హోదాలు మరిచారు.. పాదాలు కదిపారు.. ఆటలాడారు.. చప్పట్లు కొట్టారు.. కేరింతలు వేశారు.. చిన్నపిల్లల మాదిరి పోటీపడ్డారు. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. ఒంగోలు నగరంలోని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ భవనం ఆవరణలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలతో అక్కడ సందడి నెలకొంది.

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. లెమన్‌ అండ్‌ స్పూన్‌, మ్యూజికల్‌ చైర్‌, టగ్‌ ఆఫ్‌వార్‌, వక్తృత్వ పోటీల్లో చిన్న పిల్లల మాదిరిగా పోటీ పడ్డారు. ఈ పోటీలను ఒంగోలు ఏపీఎన్‌ జీవో అసోసియేషన్‌ హాలులో బుధవారం మధ్యాహ్నం ఆయూ్‌షశాఖ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.పద్మజ ప్రారంభించారు. ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డిలు పర్యవేక్షించారు. పోటీల్లో సుమారు 200 మందికి పైగా మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సాధారణంగా విధి నిర్వహణకే పరిమితమైన మహిళా ఉద్యోగులు ఆటల పోటీల్లో పాల్గొని గెలుపు కోసం పోటీడ్డారు. మహిళా ఉద్యోగుల సంఘం జిల్లా చైర్‌పర్సన్‌ కోటేశ్వరమ్మ, కన్వీనర్‌ శిరీషలు పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీవో సంఘం నాయకులు శివకుమార్‌, ఏడుకొండలు, ప్రసన్న, రామాంజనేయులు, విజయ్‌, రవితేజ, కరిముల్లా, కొత్తపల్లి మంజేష్‌, షరీఫ్‌ పాల్గొన్నారు. గురువారం టెన్నికాయిట్‌, సింగిల్‌ కాంపిటేషన్‌, స్కిప్పింగ్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటేషన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Mar 05 , 2025 | 11:47 PM