తిరునాళ్ల ఏర్పాట్లపై కసరత్తు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:39 PM
శింగరకొండ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల ఉత్సవాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తిరునాళ్ల ఉత్సవాలు 12వ తేదీన ప్రారంభమై, ప్రధాన తిరునాళ్ల 14వ తేదీ జరగనుంది. ప్రధాన తిరునాళ్ల రోజు విద్యుత్ ప్రభల ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో చీరాల ఆర్డీవో చం ద్రశేఖర్‌నాయుడు అధ్యక్షతన గురువారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేవం జరనుంది.

శింగరకొండలో ప్రారంభమైన హడావుడి
నేడు ఆర్డీవో అధ్యక్షతన
అధికారులతో సమన్వయ సమావేశం
ఆలస్యమైన కోఆర్డినేషన్ మీటింగ్
ప్రత్యేక దృష్టి సారిస్తేనే పనులు పూర్తి
అద్దంకి, మార్చి 5 (ఆంద్రజ్యోతి) : శింగరకొండ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల ఉత్సవాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తిరునాళ్ల ఉత్సవాలు 12వ తేదీన ప్రారంభమై, ప్రధాన తిరునాళ్ల 14వ తేదీ జరగనుంది. ప్రధాన తిరునాళ్ల రోజు విద్యుత్ ప్రభల ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో చీరాల ఆర్డీవో చం ద్రశేఖర్‌నాయుడు అధ్యక్షతన గురువారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేవం జరనుంది. ఏటా తిరునాళ్ల ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించేందుకు కనీసం 20 నుంచి 15 రోజుల ముందుగానే తొలి కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగేది. అనంతరం వారం రోజుల ముందు రెండవ విడత కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా శాఖల పరిధిలో పనులు ఏమేరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వెంటనే పూర్తికి తీసుకోవాల్సిన చర్యల పై సమీశ్రీ నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది తిరుణాళ్ళు వారం రోజుల గడువు మా త్రమే తొలి విడత సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయా శాఖల ఆద్వర్యంలో చేపట్టే పనులు పూర్తి చేసేందుకు అతి తక్కువ సమయం మా త్రమే ఉన్నందున పనులు పూర్తి చేయటం పై ఒకింత ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విడత సమావేశం 10 వ తేది జరిగే అవకాశం ఉండటంతో నాలుగు రోజుల వ్యవధిలోనే అత్యధిక శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. శింగరకొండ వద్ద రంగులరాట్నం, జయింట్ వీల్స్ లు ఏర్పాటు పనులు ప్రారంభం కావటం తో తిరుణాళ్ళు హడావుడి కనిపిస్తుంది. ఇక అన్ని సామాజిక వర్గాల అన్నదాన స త్రాలలో తిరుణాళ్ళు సందర్భంగా 14 వ తేది ఉదయం నుండి అర్ధరాత్రి దాటే వరకు భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ఆయా స త్రాల నిర్వహకులు ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు.