Share News

నెలాఖరులోపు సదరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేయాలి

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:27 PM

చక్రాల కుర్చీలో, మంచానికి పరిమితమై నడవలేని స్థితిలో ఉండి రూ.15వేల పెన్షన్‌ తీసుకుంటున్న లబ్ధిదారుల సదరమ్‌ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

నెలాఖరులోపు సదరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): చక్రాల కుర్చీలో, మంచానికి పరిమితమై నడవలేని స్థితిలో ఉండి రూ.15వేల పెన్షన్‌ తీసుకుంటున్న లబ్ధిదారుల సదరమ్‌ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. సదరమ్‌ సర్టిఫికెట్ల పరిశీలనపై వైద్యఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ ప్రధానకార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాస్థాయిలో స్పెషలిస్టు డాక్టర్స్‌తో వైద్యబృందాలను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను ఈనెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. వైద్యబృందం పరిశీలన చేసేందుకు అర్హులు, అనర్హులను గుర్తించేందుకు మైక్రో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని చెప్పారు. వైద్య, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ అదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ టి.జమున, డీసీహెచ్‌ఎ్‌స సూరిబాబు, లెప్రసి అధికారి సురే్‌షకుమార్‌, అధికారులు రవికుమార్‌, చిరంజీవి, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బంగారు బాల్యంపై దృష్టి సారించాలి

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం సాయంత్రం సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పిల్లల పట్ల ముందుచూపు ఉండాలన్నారు. 15నుంచి 18 ఏళ్ళలోపు డ్రాపౌట్స్‌ పిల్లలను గుర్తించి వారందరినీ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసి క్లబ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం అంశాల వారీగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు హెనసుజన్‌, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, గొట్టిపాటి వెంకటనాయుడు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:27 PM