ప్రతి ఒక్కరికీ ఆఽధ్యాత్మిక చింతన అవసరం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:11 AM
ప్రతి ఒక్కరికీ ఆఽధ్యాత్మిక చింతన అవసరమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం పద్మనాఽభునిపేటలో బుధవారం రాత్రి భద్రాతి సమేత భావనరుషి స్వామి తిరుణాళ్ల, చీరాల పాపరాజుతోటలోని శ్రీ కృష్ణ గోశాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో, తెల్ల గాంధీ బొమ్మ సమీపంలో భద్రావతీ సమేత భావనారుషి స్వామి తిరుణాల్లలో కొండయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, జనవరి 15(ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరికీ ఆఽధ్యాత్మిక చింతన అవసరమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం పద్మనాఽభునిపేటలో బుధవారం రాత్రి భద్రాతి సమేత భావనరుషి స్వామి తిరుణాళ్ల, చీరాల పాపరాజుతోటలోని శ్రీ కృష్ణ గోశాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో, తెల్ల గాంధీ బొమ్మ సమీపంలో భద్రావతీ సమేత భావనారుషి స్వామి తిరుణాల్లలో కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కొండయ్యను అర్చకులు స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గ్రామస్థులు, భక్తులు పలు అంశాలను కొండయ్య దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.