పర్యావరణ రక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:41 PM
పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కలు విఽధిగా పెంచాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు. డీఎల్‌డీవో పద్మావతి, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీ డీవో గోపీకృష్ణ అన్నారు. శనివారం చీరాల మండల పరిధిలోని జాండ్రపేట హైస్కూ ల్ వద్ద స్వచ్ఛ అంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి పర్యావరణంపై అవగాహన కల్పించారు.

ఘనంగా స్వచ్ఛాంధ్ర..స్వచ్ఛ దివస్
చీరాలటౌన్, ఫిబ్రవరి15 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కలు విఽధిగా పెంచాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు. డీఎల్‌డీవో పద్మావతి, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీ డీవో గోపీకృష్ణ అన్నారు. శనివారం చీరాల మండల పరిధిలోని జాండ్రపేట హైస్కూ ల్ వద్ద స్వచ్ఛ అంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి పర్యావరణంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు అఽధికారులు పాల్గొన్నారు. చీరాల మండల పరిధిలోని తోటవారి పాలెం పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సెక్రటరీ మేడికొండ భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు గ్రామంలో చెత్తా చెదారాన్ని తొలగించారు. వీధుల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వేటపాలెంలో..
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం వలన ప్రాంతం సస్యశ్యా మలంగా ఉంటుందని వేటపాలెం ప్రత్యేక అధికారి రాజా దెబోర, ఎంపీడీవో రాజేష్ అన్నారు. శనివారం వేటపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా చెత్తా చెదారాలను తొలగించారు. వర్మీ కంపోస్ట్ తయారీకి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.