ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:18 AM
ప్రజల భాగస్వామంతోనే గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రతిఒక్కరూ మన ఊరు-మన గ్రామంను శుభ్రం చేసుకుందాం అనే చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, శివరాంపురం గ్రామపంచాయతీలకు చెత్త తరలింపు నిమిత్తం నాలుగు ట్రాక్టర్లు మంజూ రయ్యారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ
తాళ్లూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామంతోనే గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రతిఒక్కరూ మన ఊరు-మన గ్రామంను శుభ్రం చేసుకుందాం అనే చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, శివరాంపురం గ్రామపంచాయతీలకు చెత్త తరలింపు నిమిత్తం నాలుగు ట్రాక్టర్లు మంజూ రయ్యారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యం వద్ద ఆయా గ్రామ పంచాయతీలకు వీటిని డాక్టర్ లక్ష్మి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మట్లాడా రు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్రమంత్రి నారా లోకేష్ ఆలోచనలతో రాష్ట్రం స్వచ్ఛతగా వుండాలన్న తలంపుతో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ప్రతి గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా గ్రా మాల్లోని చెత్తను చెత్తసంపద తయారీకేంద్రాలకు తర లించేందుకు ట్రాక్టర్లు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ వాహనాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు.
తాను దర్శి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కల పరిష్కారానికి కృషిచేస్తానని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తూర్పుగంగవరం-తాళ్లూరు ఆర్‌అండ్‌బీ రోడ్డునిర్మాణం పూర్తయిందన్నారు. మూడు సార్లు టెండర్లు జరిగి పనులు ప్రారంభం కాని మొగిలిగుండా రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
నారీలోకం శక్తి వంతమైనది
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా స్థానిక ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తిలకించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, నాయకులు శాగంకొండారెడ్డి, మానం రమేష్‌బాబు, వల్లభనేని సుబ్బయ్య, మేడగం వెంకటేశ్వరరెడ్డి, గొల్లపూడి వేణుబాబు, షేక్ కాలేషావలి, ఐ.రమణారెడ్డి, ఐ.శ్రీనివాసరెడ్డి, తూము శివనాగిరెడ్డి, పిన్నిక రమేష్, మన్నేపల్లి సమర, రాచకొం వెంకట్రావు, షేక్ కాశీం సైదా పాల్గొన్నారు. అలాగే, సర్పంచ్‌లు కొర్రపాటి శ్రీదేవిరామయ్య, సుజాత, గుర్వారెడ్డి, ఎంపీడీవో దారా హనుమంతరావు, తహసీల్దార్ ఇమ్మానియేల్‌రాజు, ఏవో బిప్రసాదరావు, ఎంఈవో జి.సుబ్బయ్య, ఎస్సై ఎస్.మల్లికార్జునరావు సీడీపీవో సీహెచ్ భారతి, డాక్టర్ ఖాదర్‌మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.