Share News

బాలికల బంగారు భవిష్యత్తుకు భరోసా

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:39 AM

బాలికల బంగారు భవిష్యత్తుకు ‘బంగారు బాల్యం’ భరోసాగా నిలుస్తుందని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు.

బాలికల బంగారు భవిష్యత్తుకు భరోసా

మార్కాపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): బాలికల బంగారు భవిష్యత్తుకు ‘బంగారు బాల్యం’ భరోసాగా నిలుస్తుందని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. స్థానిక కళాశాల రోడ్డులోని సౌజన్య ఫంక్షన్‌ హాలులో గురువారం డివిజన్‌ పరిధిలోని అధికారులకు బంగారు బాల్యంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ అందరూ సమస్వంతో బాలల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయాలన్నారు. బాలికలను సాధికారత దిశగా ఎదగనిస్తేనే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. బాలికల ఆరోగ్యం, విద్య, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించాల న్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది బాలలు బడికి వెళ్లకుండా పనులబాట పడుతున్నారన్నారు. బాలలను తప్పక బడికి పంపాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయున్ని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి డ్రాపవుట్స్‌పై దృష్టి సారిస్తామన్నారు. వయసును బట్టి శిక్షణ ద్వారా వారి లోని నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్నారు. బాల్యవివా హాల వలన గర్భం దాల్చి అనారోగ్యంతో కూడిన బావిభారత పౌరులకు జన్మనిస్తున్నార న్నారు. ప్రభుత్వ వైద్యశాల ల్లోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంద న్నారు. ప్రతి సచివాలయం పరిధిలో బాలబాలికలతో పాటు కిషోర బాలికల వివరాలు త ప్పక నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ వెంక ట్‌ త్రివినాగ్‌, డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు, ఐసీ డీఎస్‌ పీడీ హీనాసుజన్‌, తహ సీల్దార్‌ చిరంజీవి, కమిషనర్‌ నారాయణరావు, సీఐ పి.సుబ్బా రావు, ఎస్సై సైదుబాబు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

కొనకనమిట్ల : మండల రెవెన్యూ కార్యాలయంలో తక్షణం పరిష్కరించదగిన సమస్యలు కూడా కాలయా పన చేస్తూ పరిష్కరించకుంటే సహించనని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హెచ్చరించారు. గురువారం మార్కాపురం సబ్‌కలెక్టర్‌తో కలసి తహసీల్దార్‌ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సు లకు ఎన్ని అర్జ్జీలు వచ్చాయి? ఎన్నింటిని పరిష్కరిం చారని డీటీ అరుణకుమారిని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చిన అర్జీదారుడికి స్వయం గా కలెక్టర్‌ ఫోన్‌చేసి మాట్లాడారు. మీఅర్జీపై అధికా రులు మీతో మాట్లాడారా? సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారా? అని అర్జ్జీదారుడినుండి వివరణ తీసు కొన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను నిర్ధిష్ట గడువులో పరిష్కరిం చాలని అధికారులను ఆదేశిం చారు. భూముల మ్యూటేషన్‌ ప్రక్రియలో నిబంధనల పాటించాలన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీదారులతో ప్రత్యేకంగా ఫోన్‌లో సమాచారం అడిగి తెలుసుకుం టానని స్పష్టం చేశారు. అర్జీలు వచ్చిన తరువాత పరిష్కరానికి చర్యలు తీసుకోకుండా చేద్దాం, చూద్దామని తాత్సారం చేస్తే అటు వంటి అధికారులను సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు.

Updated Date - Jan 31 , 2025 | 12:40 AM