Share News

అర్హత ఉన్న దివ్యాంగులు భయపడవద్దు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:09 AM

అర్హత ఉన్న దివ్యాంగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు.

అర్హత ఉన్న దివ్యాంగులు భయపడవద్దు

గిద్దలూరు టౌన్‌, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): అర్హత ఉన్న దివ్యాంగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పలువురు దివ్యాంగులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని కలిసి అర్హత లేకున్నా దొంగ సర్టిఫికేట్లు పొంది ఫించన్లు పొందుతుండడం వలన నిజమైన దివ్యాంగులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కోడూరి వెంకటస్వామి తదితరులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో రూ.15వేలు పొందుతున్న దివ్యాంగులు 266 మంది ఉన్నారని, వీరిలో అనేక మంది అనారోగ్యంతో బాధపడు తున్నారన్నారు. దీంతో స్పందిం చిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కంటికి కనిపించే దివ్యాంగు లకు మాత్రం ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరుగద న్నారు. అర్హత ఉన్న వారు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అర్హత లేకున్నా సర్టిఫికేట్లు పొంది ఫించన్లు పొందుతున్న నకిలీలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో విరిగినేని గోపాల్‌, రమణయ్య, నరసయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:09 AM