విజయనగర్‌కాలనీలో స్థలాల సమస్య పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:52 PM
నగరంలోని విజయనగర్‌కాలనీలో దీర్ఘ కా లంగా ఉన్న సమస్యలను పరిష్కరించి, అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దా మచర్ల జనార్దన్ తెలిపారు

ఎమ్మెల్యే దామచర్ల
ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యో తి): నగరంలోని విజయనగర్‌కాలనీలో దీర్ఘ కా లంగా ఉన్న సమస్యలను పరిష్కరించి, అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దా మచర్ల జనార్దన్ తెలిపారు శనివారం ఒంగోలు నగరం 31వ డివిజన్‌లోని సమస్యలపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సం దర్భంగా ప్రజలు సమీపంలోని కొండను ఆనుకు న్న ఉన్న భూసమస్యపై ఎమ్మెల్యేకు వివరించారు. సుమారు 3 ఎకరాలు పైన కలిగిన స్థలంలో ఎన్జీ వోలకు పట్టాలు ఇవ్వగా, ఆ సమీపంలోనే స్థానికం గా ఉండే వారికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నా రు. అయితే ఎన్జీవోలు తమ స్థలాలను ఆక్రమిం చారని, దీనిపై తాము కోర్టుకు వెళ్లినట్లు స్థానికు లు తెలిపారు. కిందస్థాయి కోర్టు, అలాగే జిల్లా కోర్టులో కేసు వాదోపవాదనలు జరగ్గా, తాము హై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో తమ కు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ భూ సమస్యకు పరిష్కారం చూ పాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల రెవెన్యూ, కార్పొరేషన్ అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో ఉన్న పిచ్చిమొక్కలు తొలగించాలని ఆ దేశించారు. అవసరం అయితే స్థలాన్ని చదును చేసి, మట్టితోలించాలని తెలిపారు. ఆ తర్వాత సర్వే చేసి, స్థలాలు, పట్టాలు పరిశీలన చేయాలని చెప్పారు. ఆ తర్వాత అర్హులు, ఎవరు ఆక్రమిం చారో తేల్చాలని ఆదేశించారు. అదేవిధంగా స్థాని కులతో మాట్లాడుతూ అందరికీ న్యాయం చేస్తాన ని, భూసమస్యను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్‌లోని డ్రై న్‌లు, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ వాసు, ఎంఈ చెంచ య్య, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్.సుధాకర్, సర్వే యర్లు ఆవుల శ్రీనివాసరావు, నాళం వెంకటేశ్వర్లు డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.