వైరస్‌పై భయాందోళన వద్దు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:26 PM
ప్రస్తుతం చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు భాయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరిస్తే దరిచేరదని డాక్టర్ జే సౌమ్య అన్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్ దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం స్థానిక టీడీపీ నేతలు సారథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్య సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు.

వ్యక్తిగత శుభ్రత, మాస్కులు తప్పనిసరి
ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సౌమ్య
పర్చూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు భాయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరిస్తే దరిచేరదని డాక్టర్ జే సౌమ్య అన్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్ దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం స్థానిక టీడీపీ నేతలు సారథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్య సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు. దీంతోపాటు పండ్లు కూడా రోగులకు అందజేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి సౌమ్య మాట్లాడుతూ తరుచూ జ్వరం వస్తుంటే అశ్రద్ధ చేయవద్దన్నారు. సొంత వైద్యానికి స్వస్తి చెప్పి వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వాణిజ్య విభాగంగా ఉపాధ్యక్షుడు మామిడిపాక హరిప్రసాద్, పరివర్తన భవనం అధ్యక్షుడు జూపూడి మార్కు, టీడీపీ సీనియర్ నేత కె.మార్కు, వడ్డెముక్కల అబ్రహం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.